Home » జ‌య‌హో ఎన్టీఆర్… ఒక్కరోజుకు 24 ఇడ్లీ, 40 బ‌జ్జీలు, 2 లీట‌ర్ల‌పాలు…!

జ‌య‌హో ఎన్టీఆర్… ఒక్కరోజుకు 24 ఇడ్లీ, 40 బ‌జ్జీలు, 2 లీట‌ర్ల‌పాలు…!

by Bunty
Published: Last Updated on
Ad

సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీని గర్వించదగ్గ స్థాయికి తీసుకెళ్ళి తెలుగు సినిమా సత్తాని చాటి చూపారు మన సీనియర్ ఎన్టీఆర్. కొన్ని వందలకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఒకవైపు సినిమాలలో, మరొకవైపు రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవారు.

Advertisement

సినిమాలకి, రాజకీయాలకి ఎంత ఆసక్తిని చూపేవారో…తన ఆహారపు అలవాట్ల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండేవారు. మన సీనియర్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్ల అలవాట్లు ఎలా ఉండేవో ఇప్పుడు చూద్దాం…ఆయన ప్రతిరోజు ఉదయం 4 గంటలకు నిద్రలేచి రెండు గంటల పాటు వ్యాయామం చేసేవారట. ఆ తర్వాత టిఫిన్ లో భాగంగా చాలా పెద్ద సైజులో ఉండే రెండు డజన్ల ఇడ్లీలను తిని రెండు లీటర్ల పాలను తాగేవారట.

Advertisement

ఒక్కోసారి షూటింగ్స్ వేరే ప్రాంతంలో ఉండడం వల్ల టిఫిన్ చేయడానికి కుదరకపోవడంతో ఇడ్లిలకి బదులుగా అన్నంని తినేవారట. అన్నంతో తప్పకుండా నాటుకోడి మాంసం ఉండేలా చూసుకునేవాడట. ఇక సాయంత్రం పూట రెండు లీటర్ల బాదంపాలను తాగేవాడట. చెన్నైలో ఉన్న సమయంలో ఎక్కువగా బజ్జీలను తినడానికి ఇష్టపడేవాడట. ఏకంగా 40 బజ్జీలను లాగించేవారట. ఎలాంటి డైట్ లేకుండా కడుపునిండా తింటూ ఉండేవాడట మన సీనియర్ ఎన్టీఆర్.

ఇవి కూడా చదవండి

పెళ్ళిలో అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారో తెలుసా ?

MS Dhoni : దీనస్థితిలో ధోని సొంత అన్న? అస్సలు పట్టించుకోవడం లేదట !

SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

Visitors Are Also Reading