మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమాతో పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ హ్యాపీ మూమెంట్ లో ఆయన తన ఫాన్స్ కు షాక్ ఇచ్చారు. ఆయన సినిమాల నుంచి బ్రేక్ తీసుకోబోతున్నారట. కనీసం ఆరు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉంటానని సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు. దీనితో ఫాన్స్ షాక్ అవుతున్నారు.
Advertisement
అయితే.. ఆయన తన ఆరోగ్యం కోసమే ఈ ఆరు నెలల విరామం తీసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో ఆరోగ్యం కుదుటపడిన తరువాతే సినిమాలలో నటించాలని, అప్పటి వరకు సినిమాలకు దూరంగా ఉండాలని సాయి ధరమ్ తేజ్ నిర్ణయించుకున్నారట. అయితే.. ఈ విషయాన్నీ ఫ్యాన్స్ అర్ధం చేసుకుంటారని భావిస్తున్నట్లు సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నారు.
Advertisement
బైక్ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ గాయం నుంచి సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకోకుండానే బ్రో సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఆక్సిడెంట్ తరువాత కొన్ని నెలలు సినిమాలకు దూరంగా ఉండి విరూపాక్ష లో నటించారు. ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. అయితే.. పూర్తిగా కోలుకోకుండానే సినిమాల్లో నటించడం వలన సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరు నెలల పాటు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని..
ఈ సీరియల్ హీరోల రెమ్యునరేషన్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోడం పక్కా..!
డిస్కో శాంతి దగ్గర శ్రీహరి తీసుకున్న మాట ఏంటి ? రెండు సార్లు పెళ్లి ఎందుకు ?
టాలీవుడ్ కమెడియన్స్ రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా ?