Home » ఇంట్లో ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే.. ఆ ఏడాది అంతా ఇంట్లో పూజలే చేయకూడదా..?

ఇంట్లో ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే.. ఆ ఏడాది అంతా ఇంట్లో పూజలే చేయకూడదా..?

by Bunty
Ad

పూర్వకాలంలో మన పెద్దలు పాటించే పద్ధతుల్ని ప్రస్తుతం మనం పాటిస్తున్నాం. కానీ వాటి వెనుక ఉండే కారణాలు ఎవరికీ తెలియదు. ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ సంవత్సరం మొత్తం ఇంట్లో పూజలు చేయరు. అలానే పండుగలు కూడా చేసుకోరు. అయితే నిజంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ సంవత్సరం మొత్తం పూజలు చేసుకోకూడదా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే ఆ విషయాల గురించి ఎప్పుడూ చూద్దాం… కొంతమంది ఇళ్లలో ఎవరైనా చనిపోతే ఆ సంవత్సరం మొత్తం పూజలు చేయరు. పండుగలు జరుపుకోరు.

Advertisement

గుడికి కూడా వెళ్లారు. అలాగే దేవుని గది తలుపులు కూడా మూసేసి ఉంచుతారు. ఇంట్లో పూజలు చేయడం, శుభాకార్యాలు, పండుగలు, దీపారాధన చేయడం, నైవేద్యాలు పెట్టడం ఇలాంటివి ఏమీ చేయరు. అయితే ఎవరైనా చనిపోతే దీపారాధన చేయడం మానేయడం అవసరం లేదు. ఎందుకంటే దీపారాధన చేయని ఇల్లు స్మశానంతో సమానం. ఎప్పుడైనా దీపారాధన జరిగే చోటులోనే దేవుళ్ళు వస్తూపోతూ ఉంటారు. అలా ప్రతిరోజు కూడా దీపం పెట్టాలి. అప్పుడే ఇంట్లో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సౌభాగ్యాలతో ఉంటారు. ఇంట్లో ఎవరైనా చనిపోయిన అనంతరం దహన సంస్కారాలు ముగిసిన తర్వాత 11 రోజులపాటు దీపారాధన చేయడం, శుభాకార్యాలు చేయడం, పూజలు చేయడం వంటివి చేయకూడదు. కేవలం 11 రోజులు మాత్రమే ఇలా పాటించాలి. ఆ తర్వాత 12వ రోజు నుంచి శుభకార్యాలు చేయవచ్చు.

Advertisement

11వ రోజు కచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు. అయితే సంవత్సరం పొడవునా ఎక్కడికి వెళ్ళకూడదని… పూజలు చేయకూడదని… పండుగలు జరుపుకోకూడదని… ఇంట్లో దీపారాధన చేయకూడదని ఏమీ లేదు. దీపారాధన చేసుకోవచ్చు. చేయాలి కూడా. నిత్యం దీపారాధన చేయడం వలన ఇంట్లో దేవతలు తిష్ట వేసుకొని కూర్చుంటారు. దీప దూప నైవేద్యాలు లేకుండా పూజ గదిని వదిలేయడం, తలుపులు మూసేసి ఉంచడం వంటివి చేయడం చాలా పెద్ద తప్పు. అలాంటి ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. దోషాలు తగులుతాయి. కాబట్టి ఖచ్చితంగా దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల అంత మంచే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇంట్లో ఎవరైనా చనిపోయినట్లయితే దీపారాధన చేయడం మానేయకూడదు. 11 రోజులపాటే ఈ నియమాలను పాటించాలి. 12వ రోజు నుంచి దీపారాధన, పండుగలు చేసుకోవచ్చు. సంవత్సరంలోపు ఇంట్లో ఏదైనా శుభాకార్యాలు చేయాలి.

 

ఇవి కూడా చదవండి

Sangeetha: పెళ్లి త‌ర్వాత న‌ర‌కం చూశా.. భ‌ర్తను వదిలేద్దామనుకున్నా..!

భార్యకు భర్త.. టైం ఇవ్వకపోతే..భార్య ఇలాంటి పనులే చేస్తుంది !

Baby Movie Review : బేబీ సినిమా రివ్యూ..రౌడీ హీరో తమ్ముడు హిట్టు కొట్టాడా ?

Visitors Are Also Reading