Home » ఆ దేశ ఆర్మీతో ప్రభాస్ పోరు.. ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా..!

ఆ దేశ ఆర్మీతో ప్రభాస్ పోరు.. ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా..!

by Anji
Ad

కేజీఎఫ్  సిరీస్ తో బాక్సాఫీస్ వద్ద దర్శకుడు ప్రశాంత్ నీల్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ లవర్స్ కి తెగ నచ్చేశాయి. దీంతో నీల్ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై మరింత హైప్  పెరిగిపోయింది. ఈ తరుణంలో నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తుండటంతో అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడ్డాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సలార్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో హోంబలే ఫిలింస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ 28న ఆడియన్స్ ముందుకు రానుంది.

Advertisement

ఇప్పటికే చివరి దశకు చేరుకున్న ఈ మూవీ మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోవైపు తాజాగా విడుదలైన టీజర్ యూట్యూబ్ షేక్ చేస్తోంది. పవర్ ఫుల్ ఎలివేషన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్ తో విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ మరోసారి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మూవీకి కేజీఎఫ్ సినిమాతో లింక్ అయి ఉంటుందని.. అంతేకాదు.. సలార్ సైతం 2 పార్ట్స్ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు సలార్ స్టోరీ ఇదేనంటూ నెట్టింట చర్చ ప్రారంభం అయింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సున్నపురాయి మైనింగ్ ఫార్మా మాఫియా నేపథ్యంలో యూఎస్ ఆర్మీతో కనెక్ట్ అయి ఉంటుందట.

Advertisement

ప్రభాస్ యూఎస్ ఆర్మీతో చేసే పోరాట సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. 1980 బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ నడుస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇటలీలో చిత్రీకరించారని.. అదేవిధంగా స్టోరీ లైన్ లో కొన్ని ఎలిమెంట్స్ కేజీఎఫ్ ఛాప్టర్ 2 లింక్స్ ఉంటాయని తెలుస్తోంది. కేజీఎఫ్, సలార్ సిరీస్ లను కలిపి ఓ సీక్వెల్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు గతంలో మూవీ మేకర్స్ వెల్లడించారు. అందుకు తగినట్టుగానే ఈ మూవీని రూపొందిస్తున్నట్టు సమాచారం. సలార్ ఫస్ట్ పార్ట్ కి కేజీఎఫ్ 2 లింక్స్ ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఇది ఎంత వరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

సమంత, నిహారిక తరహాలోనే విడాకులకు సిద్ధమైన మరో టాలీవుడ్‌ హీరోయిన్‌ ?

తెలంగాణ రాజకీయాల్లోకి హీరో నితిన్.. నిజమాబాద్ నుంచే పోటీ ?

Rudrangi movie Review : “రుద్రంగి” మూవీ రివ్యూ..జగపతిబాబు అలరించాడా ?

Visitors Are Also Reading