Home » జబర్దస్త్ వేణు ప్రేమించిన అమ్మాయిని మోసం చేసారా? తిట్టిపోస్తున్న నెటిజన్స్.. అసలేం జరిగిందంటే?

జబర్దస్త్ వేణు ప్రేమించిన అమ్మాయిని మోసం చేసారా? తిట్టిపోస్తున్న నెటిజన్స్.. అసలేం జరిగిందంటే?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

జబర్దస్త్ తో పాపులర్ అయిన కమెడియన్ వేణు యెల్దండి ఇటీవల బలగం సినిమాతో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కమెడియన్ వేణు కాస్తా డైరెక్టర్ వేణు గా ఓవర్నైట్ లో పాపులారిటీని తెచ్చుకున్నారు. అయితే.. వేణు యెల్దండి రీసెంట్ గా తన జీవితంలో ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చారు. అందరిలానే తానూ గతంలో ఓ అమ్మాయిని ప్రేమించానని చెప్పుకొచ్చారు. ఆ అమ్మాయి కోసం చాలానే చేసానని చెప్పుకొచ్చారు.

Advertisement

ఆర్టిస్ట్ అయ్యిన తరువాత నేను ప్రేమలో పడడంతో నా రేంజ్ మారిపోతుందని అనుకున్నానని, నేను ప్రేమించిన అమ్మాయి కూడా చూడడానికి చాలా బాగుంటుందని చెప్పుకొచ్చారు. వారి ఇంటికి కూడా వెళ్ళేవాడినని, వారి ఇంట్లో వారు కూడా నాతో బాగుండేవారని చెప్పుకొచ్చారు. ఆమెను పడేయడానికి రోజు వాళ్ళింటికి వెళ్ళేవాడినని, ఎన్నో జోకులు వేసి నవ్వించేవాడినని చెప్పుకొచ్చారు. ఓ రోజు తన పుట్టిన రోజు కాకపోయినా, పుట్టినరోజు అని అబద్ధం చెప్పి ఆమెని, ఆమె ఫ్రెండ్ ని తీసుకుని గోల్కొండ కోటకు వెళ్లానని, ఆరోజు ఓ పెద్ద హోటల్ లో డిన్నర్ ఇచ్చానని చెప్పారు. ఇంటికి వచ్చాక లెక్కలు చూస్తే మొత్తం ముప్పై వేలు ఖర్చయిందన్నారు.

Advertisement

ఓ అమ్మాయి కోసం ఇంత చేయడం అవసరమా అనిపించింది. నేను ఇండస్ట్రీ లోకి రావడానికి మా అక్కలు ఎంత కష్టపడ్డారో గుర్తు వచ్చింది. అలాంటిది కుటుంబాన్ని పట్టించుకోకుండా ఓ అమ్మాయి కోసం ఇలా చేయడం ఎందుకు అనిపించిందన్నారు. ఒకవేళ ఇంత చేసినా ఆ అమ్మాయిని మా ఫ్యామిలీ ఒప్పుకోకపోతే ఎలా అన్న ఆలోచనతో జ్ఞానోదయం అయ్యిందన్నారు. మా ఇంట్లో వాళ్ళు చూపిన చుట్టాల అమ్మాయినే పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చారు. దీనితో నెటిజన్స్ అందరూ మీ ఫ్యామిలీ కోసం ఓ అమ్మాయిని మోసం చేస్తావా అని నిలదీస్తున్నారు.

మరిన్ని ముఖ్య వార్తలు

ఉపాసన డెలివరీ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారా?

రామ్‌చరణ్ కూతురికి అంబానీ అత్యంత ఖరీదైన గిఫ్ట్!

ఒక్క యాడ్ కోసం.. రాజమౌళి ఎంత పారితోషకం తీసుకున్నారు అంటే..?

Visitors Are Also Reading