తెలుగు సినిమా ప్రేక్షకులకు నిన్నటి తరం హీరోయిన్ సంఘవి గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన పల్లవి.. తరువాత పూర్తిస్థాయి హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజ శేఖర్ లాంటి అందరు స్టార్ హీరోల సరసన సంఘవి నటించారు.
Advertisement
ఈ మధ్య ఒకప్పుడు బాగా పాపులర్ అయిన తారలు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో సంఘవి కూడా ఇదే తరహాలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె పలు పాపులర్ టివి షోస్ లో జడ్జిగా కనిపిస్తున్నారు. సంఘవి 2016లో ఐటీ సంస్థ అధినేత ఎన్.వెంకటేష్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. ఇటీవలే ఆమె తన ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Advertisement
తన భర్త, కూతురుతో కలిసి ఆమె దర్శనం చేసుకున్నారు. అయితే సంఘవిని చూసిన అభిమానులు షాక్ అయ్యారు. ఆమె అస్సలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. పండితుల వేదాశీర్వచనం తరువాత, తీర్ధ ప్రసాదాలు తీసుకుని బయటకు వచ్చిన పల్లవిని మీడియా పలకరించింది. ఈ సందర్భంగా సినిమాల్లో నటిస్తారా అని ప్రశ్నించగా.. ప్రస్తుతం టివి షోలలో చేస్తున్నానని, అవకాశాలు వస్తే సినిమాల్లోకి కూడా రీ ఎంట్రీ ఇస్తానని సంఘవి చెప్పుకొచ్చారు.
మరిన్ని ముఖ్య వార్తలు:
ఉపాసన డెలివరీ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారా?
రామ్‌చరణ్ కూతురికి అంబానీ అత్యంత ఖరీదైన గిఫ్ట్!
ఒక్క యాడ్ కోసం.. రాజమౌళి ఎంత పారితోషకం తీసుకున్నారు అంటే..?