పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. తన సినీ కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా యూత్ ఫుల్ సినిమాల్లోనే నటించారు. ముఖ్యంగా సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, ఖుషి వంటి చిత్రాలు ఆయనకు యూత్ లో ఎక్కడ లేని క్రేజ్ ని సంపాదించిపెట్టాయి. వీటిలో తొలిప్రేమ గురించి కాస్త స్పెషల్ గా చెప్పుకోవచ్చు. 1998 జులై 24న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విడుదలై మరొక నెల రోజులు అయితే సరిగ్గా 25 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా తొలిప్రేమ మూవీ 4k వెర్షన్ ని జూన్ 30, 2023న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఇందులో కీర్తిరెడ్డి హీరోయిన్ గా నటించింది.
Advertisement
పవన్-కీర్తిరెడ్డి లవ్ స్టోరీకి కరుణాకరణ్ దర్శకత్వంగా వహించగా.. జీవీజీ రాజు నిర్మించారు. ఈ తరుణంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మూవీ టీమ్ పాల్గొంది. ఈ మూవీకి పవన్ కళ్యాణ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఆయనకు మొత్తాన్ని ఎలా ఇచ్చాననే విషయాన్ని వెల్లడించారు నిర్మాత జీవీజీ. అప్పట్లో పవన్ కళ్యాణ్ అప్ కమిటీ హీరో కాబట్టి రెమ్యునరేషన్ లక్షలలోనే ఉండేదని నిర్మాత రాజు చెప్పారు. రెమ్యునరేషన్ ఫిక్స్ అయిన తరువాత షూటింగ్ స్టార్ట్ చేసే ముందు ఆ మొత్తాన్ని ఎలా ఇవ్వాలని పవన్ అడిగినట్టు గుర్తు చేశారు. మీకు ఎలా కంపర్టబుల్ గా ఉంటుందో అలాగే ఇవ్వండి అని పవన్ అనడంతో తొలుత కొంత అడ్వాన్స్ ఇచ్చి.. రిలీజ్ కి ముందు బ్యాలన్స్ మొత్తం సెటిల్ చేస్తా అన్నారట. కానీ పవన్ మాత్రం ఖర్చుల కోసం నెల నెల కొంత ఇవ్వమని అనడంతో అలాగే చేశారట నిర్మాత. ఆ డబ్బుతోనే పవన్ బుక్స్, మొబైల్ ఫోన్ కొనుక్కున్నారని జీవీజీ రాజు వెల్లడించారు.
Advertisement
ఈ సినిమా విడుదలైన రెండో రోజు వెళ్లి మిగిలిన రెమ్యునరేషన్ మొత్తాన్ని పళ్లెంలో పెట్టి ఇచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా షూటింగ్ విశేషాలను పంచుకున్నారు జీవీజీ. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి, పవన్ కి చెల్లెలిగా నటించిన వాసుకి ఈ షూటింగ్ లోనే ప్రేమలో పడ్డారని తెలిపారు. అదేవిధంగా సినిమాలో కారు లోయలో పడే సీన్ కొడైకెనాల్ లో చిత్రీకరిస్తున్నప్పుడు నిజంగానే యాక్సిడెంట్ జరిగిందని.. డూప్ గా నటించిన అబ్బాయి, అమ్మాయి గాయపడ్డారని పేర్కొన్నారు. వారిని వెంటనే అంబులెన్స్ లో చెన్నైలోని ఆసుపత్రికి తరలించామని చెప్పారు జీవీజీ. సినిమా విడుదల సమయానికి పెళ్లి పత్రికతో వచ్చారన్నారు. దీంతో మేము ఆశ్చర్యపోయి.. ఇదేమిటని అడగ్గా.. హాస్పిటల్ లో ఉన్నప్పుడే తామిద్దరం ప్రేమలో పడ్డామని చెప్పారు. తొలిప్రేమ షూటింగ్ మొత్తం ఓ పిక్నిక్ వెళ్లినట్టు చాలా కూల్ గా సాగిపోయిందని గుర్తు చేసుకున్నారు నిర్మాత జీవీజీ.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
రాజమౌళి-మహేష్ మూవీపై మైండ్ బ్లాస్టింగ్ అప్డేట్.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే..?
విజయశాంతితో ఉన్న ఈ బాలుడిని గుర్తు పట్టారా..? టాలీవుడ్ ఇప్పుడు టాప్ హీరో..!
దేశముదురు సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా…!