Home » టీమిండియా నుంచి ఔట్‌.. పుజారా సంచలన నిర్ణయం

టీమిండియా నుంచి ఔట్‌.. పుజారా సంచలన నిర్ణయం

by Bunty

టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ చటేశ్వర్ పూజార గురించి తెలియని వారు ఉండరు. టెస్టుల్లో పూజారాను మించిన బ్యాట్స్మెన్ ఎవరూ లేరు అంటే అతిశయోక్తి కాదు. టీమిండియా ఎప్పుడు కష్టాల్లో ఉన్న.. జట్టును ముందుండి నడిపిస్తాడు పూజారా. దీంతో రాహుల్ ద్రావిడ్ తర్వాత ది వాల్ ఆఫ్ టీమిండియాగా పేరుగాంచాడు పూజారా. అలాంటి పూజార… ఇటీవల కాలంలో దారుణంగా విఫలమవుతున్నాడు. మొన్న ఇంగ్లాండులో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో… ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఘోర పరభవాన్ని చవిచూసింది.

ఈ మ్యాచ్ లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పటికీ… మునుపటి పూజార ఈ మ్యాచ్లో కనిపించలేకపోయాడు. ఆడిన రెండు ఇన్నింగ్స్ లలో దారుణంగా విఫలమయ్యాడు పూజార. దీంతో టీమిండియా ఆ మ్యాచ్ ఓడిపోయి… డబ్ల్యూటీసి సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే నెలలో… వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో టీమిండియా జట్టును రెండు రోజుల కిందట ప్రకటించింది బీసీసీఐ. ఈ టోర్నీలో భాగంగా రెండు టెస్టులను కూడా టీమిండియా వెస్టిండీస్ జట్టుతో ఆడనుంది.

అయితే టీం ఇండియా టెస్ట్ జట్టులో పూజారను పక్కకు పెట్టి… కొత్త కుర్రాళ్ళకు ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ. దీంతో పూర్తిగా నిరాశ చెందాడు పూజార. అటు పూజార ఫాన్స్ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో టీమిండియా స్టార్ ప్లేయర్ పూజార కీలక నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ టీమిండియా జట్టులో స్థానం సంపాదించేందుకు… దేశవాలి క్రికెట్ ఆడేందుకు నిర్ణయం తీసుకున్నాడు పూజార. ఇందులో భాగంగానే త్వరలో ప్రారంభం కానున్న దిలీప్ ట్రోఫీలో ఈ టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ పూజార ఆడనున్నాడు. పూజారతోపాటు 360 ప్లేయర్ సూర్యకుమార్ కూడా ఈ ట్రోఫీలో ఆడనున్నాడు.

ఇవి కూడా చదవండి

సొంతంగా విమానాలు ఉన్న టాలీవుడ్ హీరోలు ఎవరెవరో తెలుసా?

సమంత క్యారెక్టర్ పై.. శోభిత ధూళిపాళ సంచలన వ్యాఖ్యలు.. చైతు చాలా మంచోడు అంటూ కామెంట్ !

Samantha : మళ్లీ లవ్ లో పడ్డ హీరోయిన్ సమంత.. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading