Home » కొత్త కారు కొనుగోలు చేసిన మహేష్ బాబు.. హైదరాబాద్ లో ఫస్ట్ ఇదే..!

కొత్త కారు కొనుగోలు చేసిన మహేష్ బాబు.. హైదరాబాద్ లో ఫస్ట్ ఇదే..!

by Anji
Ad

టాలీవుడ్ సినీ నటుడు మహేష్ బాబు క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈయన సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా హీరో అయినప్పటికీ.. ఇక ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతము మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్  గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. గుంటూరు కారం సినిమా షూటింగ్ లో జాయిన్ అయినా మహేష్ ఓ ఖరీదైన కారు కొనుగోలు చేసినట్టు సమాచారం. సరికొత్త రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేశారని.. దాని ధర ఏకంగా 5.4 కోట్లు అని తెలుస్తోంది. మహేష్ బాబు కారుకు మరో ప్రత్యేకత కూడా ఉందని పేర్కొంటున్నారు.

 

ఏమిటంటే ఆయన కారు బంగారు వర్ణంలో ఉంది. హైదరాబాదులో అద్భుతమైన బంగారు రంగుతో ఉన్న ఏకైక రేంజ్ రోవర్ ఇదే అని తెలుస్తోంది. ఈ ప్రత్యేక మోడలు ప్రస్తుతం భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా నిలుస్తుంది. వాస్తవానికి మహేష్ బాబుకు అంతకుముందే రోల్స్ రాయల్స్ గోస్ట్, రేంజ్ రోవర్ వోగ్, ఆడి ఏ7, బీఎండబ్ల్యూ సెవెన్ సీరీస్, మెర్సిడెస్ బెంజు ఎస్ క్రాస్ వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి.
ఇక సినిమాల విషయానికొస్తే దాదాపు 12 సంవత్సరాల గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం ప్రాజెక్టు సిద్ధమవుతోంది. మహేష్ ఖరీదులో ఇది 28వ సినిమా. ఈ సినిమాలో శ్రీ లీలా మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రాన్ని హారిక హాసిని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద ఎస్ చినబాబు ఎస్ నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమాను చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశాడట. జులై నెలలో స్క్రిప్టు మొత్తం పూర్తి అయి రాజమౌళికి సబ్మిట్ చేయనున్నట్టు తాజాగా తెలిపాడు విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి-మహేష్ బాబు సినిమా గురించి అప్డేట్ వచ్చిందంటే ఇక అభిమానులకు పండుగ వాతావరణం నెలకొంది అని చెప్పవచ్చు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Advertisement

Visitors Are Also Reading