Home » చిరంజీవి ‘డ‌బుల్ హ్యాట్రిక్’ సినిమాలు ఏవో తెలుసా..?

చిరంజీవి ‘డ‌బుల్ హ్యాట్రిక్’ సినిమాలు ఏవో తెలుసా..?

by Anji
Ad

సినిమా కెరీర్‌ను 1978లో ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ సినిమాతో ఒక్క‌సారిగా కెరీర్ ట‌ర్న్ అయింది. కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఖైదీ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. మాధ‌వి-సుమ‌ల‌త హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా చిరంజీవికి తెలుగునాట తిరుగులేని మాస్ ఇమేజ్ వ‌చ్చింది. ఈ సినిమా త‌రువాత చిరంజీవి మ‌రొక 20 సంవ‌త్స‌రాల పాటు అస‌లు వెన‌క్కి తిరిగి చూసుకునే అవ‌కాశం కూడా లేదు. గ్యాంగ్‌లీడ‌ర్‌తో చిరు టాలీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్ హీరోగా ఎదిగారు.

Advertisement

ముఖ్యంగా చిరంజీవి కెరీర్‌లో 1987 నుంచి 1992 వ‌ర‌కు అస‌లు ప్లాప్ అన్న‌ది లేకుండా ఆరు సంవ‌త్స‌రాల పాటు వ‌రుస‌గా హిట్ సినిమాలొచ్చాయి. 1987లో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప‌సివాడి ప్రాణం సినిమా వ‌చ్చింది. చిరంజీవి-విజ‌య‌శాంతి హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన‌ది.

1988లో జి.నారాయ‌ణ‌రావు ఫ్రెండ్ నిర్మాణంలో ర‌విరాజా పినిశెట్టి ద‌ర్శ‌క‌త్ంలో యముడికి మొగుడు చిత్రం వ‌చ్చింది. య‌ముడు క‌థ‌తో తెర‌కెక్కించిన ఈ సినిమాకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. చిరంజీవి-విజ‌య‌శాంతి-రాధ హీరోహీరోయిన్లుగా న‌టించారు. 1989లో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అత్త‌కు య‌ముడు-అమ్మాయికి మొగుడు సినిమా వ‌చ్చింది. చిరంజీవి-విజ‌య‌శాంతి జంట‌గా ఈ సినిమా తెర‌కెక్కించారు. అప్ప‌ట్లో ఇది ఇండ‌స్ట్రీ హిట్‌గా కూడా నిలిచింది.

Advertisement

1990లో వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్‌పై చ‌ల‌సాని అశ్వ‌నిద‌త్ నిర్మించిన జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి విడుద‌ల అయింది. ఇందులో చిరంజీవి-శ్రీ‌దేవి జంట‌గా న‌టించిన ఈ సినిమాకు రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అప్ప‌టివ‌ర‌కు చిరంజీవి న‌టించిన సినిమాల‌కు భిన్నంగా ఒక సోషియో ఫాంట‌సీ క‌థాంశంతో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

శ్యాంప్ర‌సాద్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై 1991లో మాగంటి ర‌వీంద్ర‌నాథ్ చౌద‌రి నిర్మాణంలో విజ‌య‌బాపినీడు ద‌ర్శ‌క‌త్వంలో గ్యాంగ్‌లీడ‌ర్ సినిమా వ‌చ్చింది. చిరంజీవి-విజ‌య‌శాంతి జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో బ‌ప్పిల‌హ‌రి మ్యూజిక్ పెద్ద హైలెట్‌గా నిలిచింది. అప్ప‌టివ‌ర‌కు ఉన్న రికార్డులు అన్నింటిని ఈ సినిమా బ్రేకు చేసింది.

ఇక దేవి ఫిలిం ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కే.దేవి వ‌రప్ర‌సాద్ నిర్మాత‌గా రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఘ‌రానా మొగుడు సినిమా వ‌చ్చింది. చిరంజీవి-న‌గ్మా-వాణి విశ్వ‌నాథ్ హీరోయిన్లుగా న‌టించారు. చిరంజీవి తొలిసారిగా ఒక సినిమాకు కోటి రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్న సినిమాగా ఘ‌రానా మొగుడు రికార్డుల‌కు ఎక్కింది. ఇలా వ‌రుస‌గా ఆరు సంవ‌త్స‌రాల పాటు అదిరిపోయే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌లో న‌టించిన చిరంజీవి టాలీవుడ్‌లో అరుదైన రికార్డు సొంతం చేసుకుని త‌న‌దైన ముద్ర వేసుకున్నారు.

Visitors Are Also Reading