గంగా నది మన దగ్గరకు రాదు. వేల మైళ్లు ప్రయాణించి అయినా మనమే గంగ దగ్గరికి వెళ్లాలి. ప్రజాస్వామ్యంలో జనమే… గంగా ప్రవాహం లాంటి వారు! వాళ్ల మధ్యకి వెళ్లి కలిసి నడిచిన వారే జన నేతలు అవుతారు! ‘జనం మధ్యలో జన నేత’ అంటే మనకు ఎవరు గుర్తుకు వస్తారు? పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా తెలుగు వారందరికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కళ్ల ముందు కదలాడతారు! తలపై పాగా, తెల్లటి పంచె, స్వచ్ఛతలో ఒక దానితో ఒకటి పోటీ పడే ఆయన లాల్చీ, చిరు నవ్వులు… మనల్ని గతంలోకి తీసుకు వెళ్లిపోతాయి.
Advertisement
అదుగో… ఆ రాజన్న ఇప్పుడు పేదలు, బడుగు, బలహీన వర్గాల వారికి మరోసారి గుర్తుకు వస్తున్నారు. తమని ఆదుకునే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని వాళ్ల కళ్లలో ఆశలు మిలమిల మెరుస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ‘పీపుల్స్ మార్చ్’ అంటూ పోరుబాట పట్టిన విషయం మనకు తెలిసిందే! ఆయన ప్రస్తుతంలో ఎర్రటి ఎండల్లోనూ జనం మధ్య, జనంతో మమేకం అవుతున్నారు…
Advertisement
మార్చ్ లో ప్రారంభమైన భట్టి పాదయాత్ర దివంగత రాజశేఖర్ రెడ్డిని జనానికి తలపిస్తూ ముందుకు సాగుతోంది. వైఎస్ లాగే పంచెకట్టుతో, భరోసా ఇచ్చే చిరు నవ్వుతో, రైతుల్లో రైతుగా మారిపోయి… సామన్యుల్లో సామాన్యుడై… మన తెలంగాణ భూమి పుత్రుడు అడుగులు వేస్తున్నారు. జనం ఆయనతో తమ కష్ట, నష్టాలు చెప్పుకుంటూ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కోసం కంకణాలు కట్టుకుంటున్నారు. హస్తానికే తమ ఓటు అంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు.
వైఎస్ ను తలపించే రూపం, హావభావాలు మాత్రమే కాదు… భట్టి విక్రమార్క మరో మారు రాజన్న రాజ్యాన్ని కాంగ్రెస్ మార్కు పథకాలు, పాలనతో తాను తీసుకు వస్తానని సూటిగా, స్పష్టంగా చెబుతున్నారు. పేదల గోడు వినని ప్రస్తుత దొరల పాలనకు తమ ప్రభుత్వం పూర్తి భిన్నంగా ఉంటుందని ఆయన ప్రకటించారు.
ప్రగతి భవన్, ఫామ్ హౌజ్ ల్లోనే తొమ్మిదేళ్లు గడిపేసిన కేసీఆర్ తన రాజ ప్రాసాదాల్లోకి కామన్ మ్యాన్ కి నో ఎంట్రీ అనేశాడు. సచివాలయంలోకి కూడా సామాన్యుడు రాకుండా పోలీసుల్ని కాపాలా పెట్టేశాడు! కాంగ్రెస్ వస్తే రాజశేఖర్ రెడ్డి హయాంలో మాదిరిగా ప్రజాదర్భార్, రచ్చబండ కార్యక్రమాలు పునః ప్రారంభం అవుతాయని భట్టి అంటున్నారు. జనం సీఎం వద్దకు రావచ్చని… సీఎం జనం వద్దకు వచ్చి తీరుతాడని ఆయన హామీ ఇచ్చారు! రాబోయే ఖచ్చితంగా… పేదలకు, సామాన్యులకు ఆపన్న ‘హస్తం’ అందించే… రాజన్న రాజ్యమే!