మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ ఆరంభం చేసినప్పుడు అతనిలోని యాక్టింగ్ స్కిల్స్ చూసి ఇతను ఎప్పటికైనా పెద్ద స్టార్‌గానే ఎదుగుతాడు అని గ్రహించి ఫేమస్ కమెడీయన్ అల్లురామలింగయ్య తన కూతురు సురేఖను చిరంజీవికి పెళ్లి చేసారు. ఎంతో పేరు గాంచిన అల్లురామలింగయ్య, ఫేమస్ అయిన అల్లు అరవింద్ ఆ తరువాత హీరో మెగాస్టార్ ఇదంతా చూస్తుండగానే జరిగిపోయింది. ఇదిలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రారంభం నుంచి ఎక్కువగా చౌదరీలే ఉండేవారు. అప్పటికీ, ఇప్పటికీ టెక్నిషియన్స్, డైరెక్టర్లు ఇలా చాలా మంది కమ్మవాళ్లున్నారు.
Advertisement
ఎన్టీఆర్ రాజకీయాలలోకి వెళ్లే సమయంలో చిరు అప్పటికే హీరోగా ప్రస్థానం ప్రారంభించాడు. బాలకృష్ణ కూడా అప్పటికే తన సినిమాలతో అభిమానులను సంపాదించుకున్నాడు. మెలమెల్లగా చిరంజీవికి పాపులారీటా రావడం ప్రారంభమైనది. పెద్దవాళ్లతో జాగ్రత్తగా లేకపోతే ఎదగడం కష్టమని అల్లురామలింగయ్య భావించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ తన కొడుకును పైకి తేవడంలో అధికారంలో ఉన్న ఎన్టీఆర్, చిరును తొక్కేస్తాడేమో తమ కులం వాళ్లు ఎప్పటికీ ఫేమస్ కాలేదు కాబట్టి చిరంజీవిని జాగ్రత్తగా ఒక్కో మెట్టు ఎక్కించి పైకి తీసుకురావాలని అల్లురామలింగయ్య నడుం బిగించారు.
Advertisement
ఆ తరువాత అల్లు, చిరంజీవిని పిలిచి ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటల వరకు ఎన్టీఆర్ గేటు బయట నిలబడు. 9999అంబాసిడర్లో ఆయన బయటికి వస్తారు. వెంటనే ఎన్టీఆర్‌కు ఓ నమస్కారం చేయి అని చెప్పారట. అలా మనవాడే పైకి వస్తాడనే ఫీలింగ్ ఆయనలో కలుగుతుంది అనే ఆలోచన అల్లుది. చాలా కాలం పాటు ఆ పెద్దాయనకు చిరు గుడ్ మార్నింగ్ చెప్పేవారట. ఒకసారి వరదలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ వరద ప్రాంతాలను సందర్శించడానికి వెళ్లినప్పుడు జగదేక వీరుడు అతిలోకసుందరి టీమ్ ఆయనకు ఎదురైతే.. బ్రదర్ మీ సినిమా తుఫాన్లో కూడా కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తుందనుకుంటా అని పలుకరించారట. ఆ విధంగా చిరంజీవి ఇండస్ట్రీలో పైకి వచ్చారని తెలుస్తోంది.