సాధారణంగా పెద్దపెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే దానిపై అభిమానులకు ఎంతగానో అంచనాలు ఉంటాయి. టైటిల్ నుంచి మొదలు ప్రతి విషయాన్ని గమనిస్తూ వస్తారు. అంతేకాకుండా సినిమాలకు ట్యాగ్ లైన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. దర్శక నిర్మాతలు ఈ ట్యాగ్ లైన్ విషయంలో చాలా జాగ్రత్త పడతారు. ఈ ట్యాగ్ లైన్ వల్లే సినిమాలపై అంచనాలు కూడా పెరుగుతాయి. గుంటూరు కారం అనే సినిమాకు హైలీ ఇన్ ఫ్లేమబుల్ అనే ట్యాగ్ లైన్ ఉండేది.
Advertisement
ఈ ట్యాగ్ లైన్ అభిమానులకు కూడా బాగా నచ్చింది. అయితే ఇదే ట్యాగ్ లైన్ జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమాలో కూడా వాడారట. జూనియర్ ఎన్టీఆర్ కృష్ణవంశీ కాంబోలో వచ్చిన రాఖి చిత్రం కూడా ఇదే ట్యాగ్ లైన్ పై వచ్చింది. ఇది అనుకోకుండా జరిగింది. ఇదే విషయం తెలిసి మహేష్ మరియు ఎన్టీఆర్ అభిమానులకు తెలిసి ఆశ్చర్యపోతున్నారు. రాఖీ చిత్రానికి ఉన్న ట్యాగ్ లైన్ విషయం వీరికి తెలుసా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
Advertisement
ఇంకోవైపు సోషల్ మీడియాలో గుంటూరు కారం గ్లింప్స్ కు వస్తున్నటువంటి రెస్పాన్స్ చూసి ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ చిత్రం వచ్చేయ ఏడాది విడుదలకు సిద్ధంగా ఉంది. 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎంతటి విజయమందుకుంటుందో మనం వేచి చూడాలి.
మరికొన్ని ముఖ్య వార్తలు:
- అమెరికాలో కొత్త వైరస్ కలకలం.. దీని లక్షణాలు ఇవే..!
- ఆ మూవీలను రీ రిలీజ్ చేయమని అడుగుతున్నారు… కానీ నాకు… తేజ..!
- మే నెల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఇదే… ఆ నాలుగు సినిమాల హిట్..!