మెగాస్టార్ చిరంజీవి ఆదివారం చేసిన కామెంట్లు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. తను సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉండాలని అనుకోవట్లేదని…. ఆ హోదా తనకు వద్దని చిరంజీవి సున్నితంగా తిరస్కరించారు. కానీ అవసరమైనప్పుడు తాను సాయం చేస్తానని బాధ్యత గల బిడ్డగా ఉంటానని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇక చిరంజీవి చేసిన కామెంట్లకు పరిశ్రమ నుండి కొంతమంది సపోర్ట్ చేయగా సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఓ బహిరంగ లేఖ రాసి మరో దుమారానికి తెర లేపారు. గతంలో సినిమా ఇండస్ట్రీ విషయంలో చర్చలకై చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు మరికొందరు ప్రొడ్యూసర్లు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఏపీ సర్కార్…మరియు తెలంగాణ సర్కార్ లతో చర్చలు జరిపింది వీరే.. కాగా మోహన్ బాబు తన లేఖలో ఇండస్ట్రీ అంటే కేవలం నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్ లు కాదని అన్నారు. సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని వేల కుటుంబాలు ఉన్నాయని… ఎంతోమంది ప్రొడ్యూసర్లు ఉన్నారని అన్నారు. చిన్న ప్రొడ్యూసర్లు పెద్ద ప్రొడ్యూసర్లు అందరు హీరోలు కలిసి సమావేశమై ఆ తర్వాత ప్రభుత్వాలతో చర్చించాలని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. అంతే కాకుండా సినీ పరిశ్రమకు ఒకరు పెద్ద ఒకరు చిన్న అని తేడాలు లేవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Advertisement
ఇది ఇలా ఉంటే ఏపీలో కొంతకాలంగా సినిమా టికెట్లు ఇష్యూ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం వల్లే చిరంజీవి హర్ట్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఏపీలో సినిమా టికెట్ల ధరల విషయమై చిరంజీవి సీఎం జగన్ అపాయింట్మెంట్ కోరారని కానీ అపాయింట్మెంట్ దొరకకపోవడంతోనే చిరంజీవి హర్ట్ అయ్యారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే తాను ఇండస్త్రీ కి పెద్దగా వ్యవహరించను అని మెగాస్టార్ చెప్పినట్టుగా ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనా చిరంజీవి వ్యాఖ్యలు ఇటు మోహన్ బాబు బహిరంగ లేఖ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.