Home » పూరి ‘డబుల్ ఇస్మార్ట్’.. మరో హిట్ కొట్టాలని ఫిక్స్ !

పూరి ‘డబుల్ ఇస్మార్ట్’.. మరో హిట్ కొట్టాలని ఫిక్స్ !

by Anji
Ad

ఇటీవల లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ మూటగట్టుకున్న డాషింగ్ దర్శకుడు పూరిజగన్నాథ్. ఇక ఈ సారి రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నారు. పూరి జగన్నాథ్ తరువాత సినిమా ఏ హీరోతో అనేది గత కొద్ది నెలల నుంచి చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆసక్తికి తెరదించుతూ.. మంచి కిక్ ఇచ్చే అప్డేట్ ఇచ్చారు పూరి. తాజాగా తన తరువాత ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ప్రకటించారు. యువ హీరో రామ్ పోతినేనితో మరోసారి మ్యాజిక్ చేయబోతున్నట్టు చెప్పేశారు. డబుల్ ఇస్మార్ట్ మూవీ కన్ ఫర్మ్ చేశారు పూరి జగన్నాథ్. 

Advertisement

ఇస్మార్ట్ శంకర్ తరువాత దీనికి సీక్వెల్ గా మరో మూవీ కూడా ఉంటుందని అప్పట్లోనే చెప్పాడు పూరి జగన్నాథ్. అయితే ఇప్పుడు అందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేసారు. డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 08న పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ టైటిల్ పోస్టర్ లో  శివలింగం, త్రిశూలం కనిపిస్తోంది. 

Advertisement

గతంలో రామ్ పోతినేని హీరోగా పూరిజగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ బాక్సాఫీస్ లెక్కలను మార్చేసింది. దీంతో ఇప్పుడు మళ్ళీ అదే కాంబో రిపీట్ కానుండటం జనాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్‌లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారట.హై యాక్టేన్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాను పూరీ జగన్నాథ్, చార్మి కౌర్ ప్రొడక్షన్ హౌస్ పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించనున్నారు. మాస్ ఆడియన్స్ కోరుకునే అంశాలు పుష్కలంగా ఉండేలా ఈ డబుల్ ఇస్మార్ట్ మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. లైగర్ వంటి చేదు జ్ఞాపకాలను మరిచిపోయి మరో హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు పూరి జగన్నాథ్. 

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు: 

Adah Sharma: రోడ్డు ప్రమాదంలో ఆదాశర్మకు తీవ్ర గాయాలు

రోడ్డుపైనే యువకుడి చెంప చెల్లుమనిపించిన హీరోయిన్ సంయుక్త.. అందుకోసమేనా ?

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచి కొత్త రేషన్ కార్డులు

Visitors Are Also Reading