Home » ఐపీఎల్ హిస్టరీలోనే భారీ రికార్డు.. 236 స్ట్రైక్ రేట్ తో 229పరుగులు !

ఐపీఎల్ హిస్టరీలోనే భారీ రికార్డు.. 236 స్ట్రైక్ రేట్ తో 229పరుగులు !

by Anji

ఐపీఎల్  చరిత్రలోనే అతి పెద్ద భాగస్వామ్యం రికార్డు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరిట ఉంది. ముఖ్యంగా ఆర్సీబీకి చెందిన విరాట్ కోహ్లీ, ఏబి డివిలియర్స్ ఈ రికార్డును సృష్టించారు. సరిగ్గా ఏడేళ్ల కిందట అంటే.. 2016లో ఈరోజు అనగా మే 14న ఐపీఎల్ లో అతి పెద్ద భాగస్వామ్యంతో  ఈ ఇద్దరు ఆటగాళ్లు రికార్డు సృష్టించారు. విరాట్ కోహ్లీ డివిలియర్స్ గుజరాత్ లయన్స్ పై తుఫాన్ ఇన్నింగ్ ఆడి  చరిత్ర సృష్టించారు.2016లో గుజరాత్ పై దివిలియర్స్, విరాట్ రెండో విక్వైట్ కు 229 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యంలో ఇద్దరి బ్యాట్ల నుంచి మొత్తం 20 సిక్సర్లు నమోదు అయ్యాయి.

ముఖ్యంగా విరాట్ కోహ్లీ, డివిలియర్స్ భాగస్వామ్య  స్ట్రైక్ రేటు 236.08గా నిలిచింది. కేవలం 97 బంతుల్లోనే డివిలియర్స్ కోహ్లీ ఈ ఘనత సాధించారు. ఈ మ్యాచ్ లో కలుస్తా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 3.5 ఓవర్లలో తొలి వికెట్ కోల్పోయింది. కేవలం 13 బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసి క్రిస్ గేల్ పెవిలియన్ కి చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన డివిలియర్స్ విరాట్ కోహ్లీతో కలిసి అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. డివిలియర్స్ 248.08 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తూ 52 బంతుల్లో అజయంగా 129 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు,  12 సిక్సర్లు ఉన్నాయి.

Manam News

ఇక అదే సమయంలో విరాట్ కోహ్లీ 55 బంతుల్లో ఐదు ఫోర్లు,  ఎనిమిది సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. కోహ్లీ స్ట్రైక్ రేట్ 198.18 గా నిలిచింది. ఫస్ట్   బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. పరుగుల ఛేదనలో గుజరాత్ లయన్స్ 18.4 ఓవర్లలో 104 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో ఆర్సీబీ 144 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలోనే ఇదే రెండో అతిపెద్ద విజయం. ఈ మ్యాచ్ బెంగళూరులో జరిగింది. ఐపీఎల్ లో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసిన ముంబై ఇండియన్స్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. 2017లో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై 146 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 గంభీర్ పై కోహ్లీ ఫ్యాన్స్ దాడి… ఏకంగా వాటితోనే!

 ప్రభాస్ తో సినిమా చేసేందుకు ఆ స్టార్ హీరోయిన్ ఎందుకు భయపడుతోంది ?

 మీ ఇంటికి కాకులు, చీమలు వస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Visitors Are Also Reading