Home » కొరటాల శివ ఆ సినిమాకి అంతగా కష్టపడినా.. స్క్రీన్ పై పేరే వేయలేదా ?

కొరటాల శివ ఆ సినిమాకి అంతగా కష్టపడినా.. స్క్రీన్ పై పేరే వేయలేదా ?

by Anji
Ad

కొరటాల శివ గురించి చాలా మందికీ తెలిసే ఉంటుంది. కానీ ఆయన సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత దర్శకుడిగా ఎలా మారాడనే విసయం మాత్రం చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది.  విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత 1998లో ఉద్యోగం చేసుకుంటూ.. తనకు వరసకు బావ అయిన పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. ఒక్కడున్నాడు, మున్నా, ఊసరవెల్లి, బృందావనం వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశాడు. ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు, జూనియర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, మహేష్ తో రెండో సినిమా భరత్ అనే నేను. మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాలను తెరకెక్కించారు. 

Advertisement

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సింహ సినిమా వచ్చిన విషయం విధితమే. ఈ మూవీలో నలుగురికి మంచి చేయటానికి ఆయుధం పట్టిన వైద్యుని పాత్రలో నందమూరి బాలకృష్ణ నటించాడు. కథ, కథనాలు, సంభాషణలు “సింహ” సినిమా విజయానికి ఉపయోగపడ్డాయి. గతంలో మున్నా, బృందావనం, ఊసరవెల్లి వంటి సినిమాలకు సంభాషణలు అందించిన కొరటాల ఈ మూవీకి కూడా సంభాషణలు రాశారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కంటే ముందు కథలో విలీనమై అద్భుతమైన సంభాషణలు రాసిన కొరటాల శివకు సింహ సినిమా విడుదలైన తరువాత తెరమీద టైటిల్స్ లో తన పేరు కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయారట. 

Advertisement

Also Read :  పుష్ప మూవీలో భన్వర్ సింగ్ పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోనేనా ?

ఆ తర్వాత కొరటాల  రాసుకున్న కథను.. మరో దర్శకుడికి ఇవ్వకుండా తానే  దర్శకత్వం వహించాలనుకున్నాడట.  ఆ క్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్ కి ఆ స్టోరీని చెప్పారు. కొరటాల చెప్పిన స్టోరీ ప్రభాస్ కి నచ్చడంతో సినిమాకి ఒప్పుకున్నాడట. అలా యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ప్రభాస్ హీరోగా, అనుష్క, రీచా గంగోపాధ్యాయ హీరోయిన్లుగా పెట్టి తొలి సినిమా మిర్చిని తెరకెక్కించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తన శ్రమను నమ్ముకొని తీసిన “మిర్చి” చిత్రం బాక్సాఫీస్  వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  ఇప్పుడు కొరటాల వరుస సినిమాలు తీస్తూ ఓ అగ్రదర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. ‘ఎన్టీఆర్ 30’ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. 

Also Read :  కమలహాసన్ ను ప్రాణంగా ప్రేమించి.. చివరికి ప్రాణాలు పోగొట్టుకున్న స్టార్ హీరోయిన్..!!

Visitors Are Also Reading