ఐకాన్ స్టార్ స్టార్ అల్లు అర్జున్ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చిత్రం పుష్ప. టాలీవుడ్ దర్శకుడు సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో వచ్చిన మూడో మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా రికార్డ్స్ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. అంతేకాదు.. ఈ మూవీ బన్నీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న బన్నీకి.. పుష్ప మూవీతో నార్త్ ఇండస్ట్రీలోనూ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో పక్కా ఊర మాస్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటన అదరగొట్టారు.
Also Read : కమలహాసన్ ను ప్రాణంగా ప్రేమించి.. చివరికి ప్రాణాలు పోగొట్టుకున్న స్టార్ హీరోయిన్..!!
Advertisement
Advertisement
దీంతో ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమాలో బన్నీ పాత్రతో పాటు.. హైలెట్ అయినా మరో రోల్ భన్వర్ సింగ్ షెకావత్. ప్రధమార్థంలో పుష్పరాజ్ కు, షేకావత్ కు మధ్య అసలైన వార్ మొదలవుతుంది. ఇక వీరిద్దరి మధ్య వివాదం ఏ స్థాయిలో ఉండనుంది అనేది సెకండ్ పార్ట్ లో తెలియబోతోంది. ఈ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ నటించారు. అయితే ఆయన కంటే ముందే ఈ రోల్ కోసం సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోను సంప్రదించారట మేకర్స్. అతను రిజెక్ట్ చేయడంతో ఈ పాత్ర ఫహద్ వద్దకు చేరినట్లుగా సమాచారం.
ఆ హీరో మరెవ్వరో కాదండోయ్.. ఈ మూవీలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర కోసం సుకుమార్ ముందుగా తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని సంప్రదించారట. కానీ అప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న సేతుపతి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ మూవీని వదులుకున్నారట. దీంతో ఈ పాత్ర కోసం ఫహద్ ఫాజిల్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భన్వర్ సింగ్ పాత్రలో విజయ్ సేతుపతి నటించి ఉంటే పుష్ప మరోలా ఉండేదంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : విడాకుల ఫోటోషూట్.. ఆనందంతో గంతేస్తున్న నటి.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు..!!