సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి ఎందరో నటులు వస్తుంటారు, పోతుంటారు. వారిలో కొందరూ మాత్రమే సక్సెస్ సాధిస్తుంటారు. సక్సెస్ సాధించిన వారిలో కొందరూ కనుమరుగు అయితే మరికొందరూ ఎన్ని ఆటంకాలు ఎదురైనా వారు అలాగే కొనసాగుతుంటారు. ఇలా రకరకాల జరిగినప్పటికీ చివరికీ మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడ నిలదొక్కుకుంటారు. ఎప్పటికప్పుడు ప్రతిభకు సానబెడుతూ, ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా తమను తాము మార్చుకునేవారు మాత్రమే ఎక్కువ కాలం ఉండగలరు.
Also Read : భారీ సిక్స్ బాదిన విండిస్ వీరుడు.. షాక్ లో మిగతా ప్లేయర్స్..!
Advertisement
అలా స్థిరపడిన నటులకే పర్మినెంట్ క్రేజ్ ఉంటుంది. అలాంటి పాపులారిటీ ఉన్న నటులలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో ఎన్నో హిట్ చిత్రాల్లో ఆయన నటించారు. ఫ్లాప్లు ఎదురైనప్పటికీ, సరైన పాత్రలు రాకపోయినా ఇండస్ట్రీని మాత్రం వీడలేదు. నచ్చిన పాత్రలు వచ్చేంత వరకు అవకాశం కోసం ఎదురు చూశారు. అలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు చెలరేగి యాక్టింగ్ చేశారు. హిందీ సినీ పరిశ్రమలో విలక్షణమైన నటులలో అర్జున్ రాంపాల్ ఒకరు.
Also Read : ఓటీటీలోకి లారెన్స్ రుద్రడు.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే ?
Advertisement
#ArjunRampal's girlfriend #GabriellaDemetriades announces second pregnancy
Read: https://t.co/MDH4LeUO3s pic.twitter.com/eb52k3mdpc
— IANS (@ians_india) April 29, 2023
డాన్, రాక్ ఆన్, డీ-డే లాంటి చిత్రాల ద్వారా అర్జున్ రాంపాల్ విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకున్నారు. అలాంటిది ఆయన ఇప్పుడు మరోసారి తండ్రి కాబోతున్నారు. చాలా రోజులుగా సహజీవనం చేస్తున్న అర్జున్ రాంపాల్-మోడల్ గార్బెల్లాలు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. తన బేబీ బంప్ ఫొటోలను గార్బెల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో స్టార్ హీరోయిన్లు కాజల్, అమీ జాక్సన్ తదితరులు వీరికి శుభాకాంక్షలు కూడా తెలిపారు. అర్జున్ రాంపాల్ 1998లో మెహర్‌ను పెళ్లాడగా.. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. అనంతరం గార్బెల్లాతో సహజీవనం చేస్తున్నట్లు అర్జున్ రాంపాల్ ప్రకటించారు. వీళ్లిద్దరికి ఇప్పటికే ఒక బాబు జన్మించాడు. తాజాగా రెండోసారి ప్రెగ్నెంట్ కావడంతో పెళ్లి కాకుండానే రెండో సారి తల్లిదండ్రులు అయిన నటులు అని వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
Also Read : హీరోలలో అందరికన్నా మంచివాడు ప్రభాస్.. దర్శకుడు తేజ ఏమన్నారంటే..?