BRS ప్లీనరీ సమావేశంలో పార్టీ ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ కీలక వాక్యాలు చేశారు. ఎన్నికలు మరో నాలుగు నెలలే ఉన్నాయని, అక్టోబర్ వరకే తమకు చాన్స్ అని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు ఇళ్ళలో కాదు… ప్రజల్లో ఉండాలని సూచించారు. 100 సీట్లు లక్షంగా పని చేయాలన్నారు. వ్యక్తిగత ప్రతిష్ఠకు పోకుండా పార్టీ కోసం కలిసి పని చేయాలని హితవు పలికారు.
READ ALSO : నరసింహనాయుడు లో మానస్ ఉన్నాడని మీకు తెలుసా… ఈ బుడ్డోడేనట…!
Advertisement
లీడర్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మానుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ 22 వసంతాలు పూర్తిచేసుకుని 23వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో తెలంగాణ భవన్ లో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే పార్టీ సర్వసభ్య సమావేశం కూడా నిర్వహించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో… గులాబీ బాస్ కీలక వాక్యాలు చేశారు. మరోవైపు ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు.
Advertisement
READ ALSO : వడదెబ్బ తగిలితే… కోమాలోకి వెళ్ళిపోతామా?
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో… కొందరు ఎమ్మెల్యేలు, నేతలు అవినీతికి పాల్పడుతున్నట్టు తనకు రోజురోజుకు ఫిర్యాదులు పెరుగుతున్నాయన్నారు. దళిత బంధులో భాగంగా లబ్ధిదారులకు ఇస్తున్న డబ్బులు ఎమ్మెల్యేలు లంచంగా తీసుకుంటున్నారన్న సమాచారం తన దగ్గర ఉందన్నారు. సుమారు 3 లక్షల వరకు నొక్కేస్తున్నట్టు కూడా కేసీఆర్ తెలపడం గమనార్హం.
READ ALSO : రెచ్చిపోయిన ‘RX 100’ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్… ఏకంగా అలా..!