Home » పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ టెస్ట్..  అసలు కారణం తెలిస్తే నోరేళ్లబెడతారు..!!

పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ టెస్ట్..  అసలు కారణం తెలిస్తే నోరేళ్లబెడతారు..!!

by Sravanthi
Ad
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు  పెద్దలు.  కానీ ప్రస్తుతం ఆ మాట మసకబారిపోయింది.  పెళ్లి అంటే నమ్మకం ప్రేమ అనే విషయాలు వెనక్కి నెట్టి  పెళ్లంటే టెస్టులు అనే విధంగా తయారయ్యారు జనాలు.  పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ టెస్టులు చేయించుకోవాలని అంటున్నారు.. అది ఎక్కడో పూర్తిగా చూద్దామా..  మధ్యప్రదేశ్ సర్కార్ ముఖ్యమంత్రి కన్య వివాహ యోజన పథకాన్ని 2006లో ప్రారంభించింది. ఈ స్కీమ్ లో ఆర్థికంగా వెనుకబడిన  ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం  రూ. 56వేల ఆర్థిక సాయం అందిస్తోంది.  ఈ తరంలో దిండూరిలోని  గద్సారం ఏరియాలో  ఈ పథకం కింద సామూహిక వివాహాలు నిర్వహించారు.
అయితే ఈ వివాహాలకు ముందు  నూతన వధువులకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఐదుగురు  పెళ్లికూతురులకు  ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. దీంతో పెళ్లిళ్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగించారు.  దీనిపై ఒక్కసారిగా రాజకీయ దుమారం జరిగింది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయమని ఎవరు ఆర్డర్ చేశారంటూ  కాంగ్రెస్ ప్రశ్నించింది.  ఇదే విషయంపై ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన వారు మాట్లాడుతూ..
పెళ్లికి ముందు నుంచే కాబోయే భర్తతో నేను కలిసి ఉంటున్న.. అందుకే నా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ గా వచ్చింది. బహుశా ఇందుకోసమే ఫైనల్ లిస్ట్ నుంచి నా పేరు తొలగించారు అధికారులు,  నా పేరు తొలగించడానికి సరైన కారణం ఇప్పటివరకు చెప్పలేదని తెలియజేసింది.  గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి టెస్టులు నిర్వహించలేదని బచ్చారుగావు గ్రామ సర్పంచ్ ముదా నీ మారవి తెలిపారు.  అయితే ఇది మధ్యప్రదేశ్ ఆడబిడ్డలను అవమానించడమే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విమర్శలు చేస్తోంది.  మరి ఇలా టెస్టులు చేయడంపై మీ అభిప్రాయాలు ఏంటో తెలియజేయండి.

Advertisement

Visitors Are Also Reading