భారతదేశంలో సినిమా హీరోలకు దీటుగా క్రికెట్ ప్లేయర్స్ కి ఓ క్రేజ్ ఉంటుంది. క్రికెట్ ని ప్రత్యేకంగా అభిమానిస్తుంటారు. ఈ నేపథ్యంలో చాలా మంది భారత క్రికెట్ జట్టులో రాణించడానికి తీవ్రంగా కష్టపడుతుంటారు. ఎంతో టాలెంట్ ఉంటే తప్ప ఇండియన్ టీమ్ లో చోటు సంపాదించుకోలేరు. కొంత మంది చోటు దక్కించుకున్న కానీ దురదృష్టం వెంటాడి కెరీర్ బాగానే ఉన్నప్పటికీ అర్థాంతరంగా జట్టులో నుంచి స్థానం కోల్పోయిన ప్లేయర్లు ఉన్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ ఎదగలేక జట్టులో స్థానం కోల్పోయిన ఐదుగురు లెజెండరీ క్రికెటర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : IPL లోకి చరణ్ ఎంట్రీ… ఏపీ నుంచి కొత్త జట్టును దించుతున్నాడు!
Advertisement
అంబటి రాయుడు :
2019 ప్రపంచ కప్ కి ముందు జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు అంబటి రాయుడు. కానీ ఆ తరువాత సెలెక్టర్లు త్రీడీ ఆటగాడికి ప్రాధాన్యత ఇస్తూ.. రాయుడిని జట్టు నుంచిసడన్ గా తొలగించారు. ప్రపంచ కప్పులో ఆటగాళ్లకు గాయపడిన కానీ స్టాండ్ బై గా ఉన్న రాయుడిని జట్టులోకి ఏమాత్రం తీసుకోలేదు. ఈ పరిణామంతో అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు.
వసీం జాఫర్ :
ఇండియన్ క్రికెట్ టీమ్ లో ది లెజెండ్ ఆఫ్ డొమెస్టిక్ క్రికెట్ ప్లేయర్ గా పేర్గాంచాడు. ముంబైకి ఆడుతున్న సమయంలో ఫస్ట్ క్లాస్ కెరీర్ లో అత్యధికమైన పరుగులు చేసిన ఆటగాడుగా రికార్డు క్రియేట్ చేశాడు. చాలా సందర్భాలలో భారత్ క్రికెట్ టీమ్ లో క్రిజ్ లో నిలబడ్డాడు. అద్భుతమైన టెక్నిక్ బ్యాటింగ్ కలిగిన ఈ ప్లేయర్ నీ సెలెక్టర్లు అతని ఆటకి తగ్గ రీతిలో జట్టులో స్థానం కల్పించకుండా తీసేశారు.
కరణ్ నాయర్ :
Advertisement
2016లో ఇంగ్లాండ్ జట్టుపై త్రిబుల్ సెంచరీ చేసిన ఆటగడు కరణ్ నాయర్. ఇండియన్ టీమ్ లో వీరేంద్ర సెహ్వాగ్ తరువాత ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడుగా రికార్డు సృష్టించాడు. నాయర్ పేరు మారుమ్రోగిపోయింది. కానీ గమ్మత్తు ఏంటంటే.. ఆ తరువాత సెలక్టర్లు మనవడిని పక్కన పెట్టేశారు. ట్రిపుల్ సెంచరీ చేసిన ట్రాక్ రికార్డు చూసి కూడా జట్టులోకి రాణించలేదు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరుగలేదు.
దినేష్ కార్తీక్ :
భారత్ క్రికెట్ జట్టులో వికెట్ కీపర్ గా దినేష్ కార్తీక్ అద్భుతమైన సేవలందించాడు. కానీ కెరీర్ ప్రారంభంలో పెద్దగా రాణించలేకపోయాడు. వయసులో ఉన్నప్పుడు చాలా పరాజయాలు ఎదుర్కొన్నాడు. పైగా మహేంద్రసింగ్ ధోని వికెట్ కీపర్ గా ఉండటంతో… టీమ్ లో పెద్దగా రాణించలేకపోయాడు. ఎప్పుడైతే ధోని జట్టు నుంచి వైదొలిగాడో… దినేష్ కార్తీక్ రాణించాడు. కానీ అప్పటికే ఏజ్ ఎక్కువ కావడంతో మనోడికి దురదృష్టం వెంటాడి ప్రస్తుతం జట్టులో స్థానం సంపాదించలేక.. పలు విధాలుగా కెరీర్ పరంగా సతమతమవుతున్నాడు.
Also Read : చిరంజీవి సినిమాలో నటించమని అడిగితే శ్రియ ఏమందో తెలుసా ?
ఇర్ఫాన్ పఠాన్ :
ఎడమ చేతి వాటం కలిగిన ఈ బౌలర్ ప్రారంభంలో దుమ్ము దులిపాడు. 23 ఏళ్ల వయసులో ఇండియన్ టీమ్ లో అరంగేట్రం చేసి.. మూడు ఫార్మాట్ లలో రాణించి జూనియర్ కపిల్ దేవ్ గా గుర్తింపు పొందాడు. అద్భుతమైన స్వింగ్ బౌలింగ్ తో బ్యాట్స్ మెన్ లను ముప్పు తిప్పలు పెట్టేవాడు. ఇండియన్ కోచ్ గ్రేగ్ చాపల్.. తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ పూర్తిగా డేంజర్ జోన్ లో పడింది. ఇండియన్ టీం కి మంచి బౌలింగ్ వేసే ఈ ఆటగాడిని ఆల్ రౌండర్ గా తీర్చిదిద్దాలని.. గ్రేగ్ చాపల్ చేసిన ప్రయోగం అట్టర్ ప్లాప్ అయింది. దీంతో ఆటు బౌలింగ్ చేయలేక ఇటు బ్యాటింగ్ సరిగ్గా ఆడలేక..పఠాన్ జట్టులో రాణించలేక స్థానం కోల్పోయాడు.