Home » బలగం సినిమా ద్వారా తొమ్మిదేళ్ల తర్వాత ఒక్కైటన అక్కా, తమ్ముడు

బలగం సినిమా ద్వారా తొమ్మిదేళ్ల తర్వాత ఒక్కైటన అక్కా, తమ్ముడు

by Anji
Ad

ఈ మధ్య కాలంలో వచ్చిన “బలగం” చిత్రం ప్రేక్షకులందరి మనసుకు హత్తుకుపోయిందనే చెప్పాలి.  ముఖ్యంగా తెలంగాణలోని పలు కుటుంబాల్లో చోటు చేసుకున్న పరిణామాలను సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు దర్శకుడు వేణు.  ప్రధానంగా కుటుంబసభ్యులు కలిసి మెలిసి ఉండాలని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నో ఏళ్ల తరబడి విడిపోయిన కుటుంబాలు కూడా ‘బలగం’ సినిమా చూసిన తరువాత ఒక్కటైపోయాయి. అనవసర పట్టింపులతో దూరం అయిన బంధువులు కూడా ఈ సినిమా చూసిన తర్వాత తమవారితో కలిసిపోతున్నారు. అదే తరహాలో జనగామ జిల్లాలో ఓ అక్కా తమ్ముళ్ళ మధ్య ఎడబాటును దూరం చేసి కలిపింది. 

Also Read :  నరేష్ ప‌విత్ర‌ల “మ‌ళ్లీ పెళ్లి” సినిమా క‌థ లీక్…అదే పెద్ద ట్విస్ట్..?

Advertisement

ఒకే ఊరిలో ఉంటూ.. ఒకరినొకరు చూసుకోకుండా, మాట్లాడుకోకుండా దూరం అయిన అక్కా, తమ్ముళ్ళు ‘బలగం’ మూవీ చూసిన తరువాత ఒకరినొకరు కలుసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం వనపర్తి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నేలమంచి వీరరెడ్డి, కొమలమ్మ దంపతులకు నలుగురు సంతానం. వారిలో యాదమ్మ, గాలమ్మ, భూపాల్ రెడ్డి, పద్మారెడ్ది. తొమ్మిది సంవత్సరాల కిందట గాలమ్మ చిన్న కొడుకు పెళ్లి జరిగింది. ఆ సమయంలో సంప్రదాయం ప్రకారం.. పుట్టింటి నుంచి రావాల్సిన  బియ్యం, సారె కార్యక్రమం అన్నదమ్ములు చేపట్టలేదు.  

Advertisement

Also Read :  తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ పండుగ జరుపుకునేది ఎప్పుడో తెలుసా ? 

అప్పటినుంచి మనస్పార్థాలు పెరిగి, బంధాలు కూడా తెగిపోయాయి. నాలుగు కుటుంబాల వారు దూరం అయిపోయారు. ఒకే ఊరిలో ఉంటున్నా.. ఒకరినొకరు అస్సలు పలకరించుకోలేదు.  ఒకరి ఇంటికి మరొకరు వెళ్లలేదు.  శుభకార్యాలకు కూడా పిలుపులు లేవు. వీరి కుటుంబాలు విడిపోయాయి. ఈ మధ్య ఆ గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఓ ప్రొజెక్టర్ పెట్టి ‘బలగం’ సినిమా చూపించారు. ఊరంతా కలిసి ఈ సినిమా చూశారు. రెండు, మూడు రోజుల్లో అక్కా తమ్ముళ్లందరూ కూడా కలిసిపోయారు. ఊరిలో గ్రామ దేవతల పండుగ చేసే క్రమంలో ఆడపడుచులను ఇంటికి ఆహ్వానించి ఆనందోత్సాహాలతో పండగను జరుపుకున్నారు. ప్రస్తుతం అందరి కలయికతో ఈ నాలుగు కుటుంబాలు సంతోషంతో ఉంటున్నారు.  

Also Read : చిరంజీవితో పోలిక గురించి రాజ్ కుమార్ ఏమన్నారో తెలుసా ?

Visitors Are Also Reading