టాలీవుడ్ లో అగ్ర దర్శకుడు, పరాజయం ఎరుగని దర్శకుడు ఎవరని చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది దర్శక ధీరుడు రాజమౌళినే. అదేవిధంగా కోలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకుడు ఎవరు అని అడిగ్గానే తొలుత గుర్తుకొచ్చేది స్టార్ దర్శకుడు వెట్రిమారన్ పేరే చెబుతారు. వెట్రిమారన్ ఇప్పటివరకు తెరకెక్కించిన చిత్రాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. తాజాగా వెట్రిమారన్ దర్శకత్వం వహించిన విడుతలై చిత్రం కూడా తమిళంలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే.
Also Read : Pushpa 2 : పుష్ప 2 లోనూ సమంత ఐటెం సాంగ్ ?
Advertisement
ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పార్ట్ 1 ఏప్రిల్ 15న తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ చేసేందుకు వెట్రిమారన్ హైదరాబాద్ విచ్చేశారు. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, వెట్రిమారన్ దర్శకత్వంలో నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్న విషయం విధితమే. తాజాగా ఆ వార్తలపై స్పందించారు వెట్రిమారన్. ఆడుకులం సినిమా సమయంలో తాను, బన్నీ చెన్నైలో కలిశామని చెప్పారు. అప్పుడు అల్లు అర్జున్ తమిళంలో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను మీ దగ్గర ఏదైనా కథ ఉంటే చెప్పండి అని అడిగారు. అప్పుడు నేను వడా చెన్నై స్టోరీ లైన్ చెప్పాను.
Advertisement
కానీ ఆ తరువాత అది నాకే సెట్ అవ్వదనిపించి మధ్యలోనే ఆపేశాను అని చెప్పుకొచ్చారు వెట్రిమారన్. ఇక కరోనా సమయంలో ‘అసురన్’ మూవీ తరువాత అల్లు అర్జున్-ఎన్టీఆర్ ఇద్దరినీ కలిశాను. ఎన్టీఆర్ కి కూడా ఓ కథ వినిపించాను. దానిని ముందుకు తీసుకెళ్లాలి. అందుకు చాలా సమయం ఉందని చెప్పాడు వెట్రిమారన్. ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ, వార్ 2, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో మూవీ చేస్తుండటంతో ఈ సినిమాలు అన్ని పూర్తయ్యే సరికి చాలా సమయం పట్టేట్టు కనిపిస్తోంది. మరోవైపు అల్లు అర్జున్, ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారా అని ప్రశ్నించగా.. ఏమో అయి ఉండొచ్చు అని ఆశ్చర్యపరిచాడు. వాస్తవానికి ఎన్టీఆర్, అల్లు అర్జున్ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కితే అభిమానులకు అంతకంటే పండుగ మరోటి ఉండదు అని చెప్పవచ్చు.
Also Read : మెగా ఇంట్లో బిడ్డ పుడితే ఉపాసనకు పరిస్థితి దారుణమేనట..!!