సృష్టిలో అన్నింటి కంటే గొప్ప బంధం ఏదైనా ఉంది అంటే అది భార్యభర్తల బంధమే. అప్పటి వరకూ ఎలాంటి పరిచయం లేకపోయినా పెళ్లి తరవాత భార్య తన పుట్టింటిని వదిలిపెట్టి మెట్టినింట్లో అడుగుపెడుతుంది. భర్త కుటుంబమే తన కుటుంబం అనుకుంటుంది. అంతే కాకుండా అప్పటి వరకూ తన ప్రపంచం ఏదో తెలియని భర్తకు భార్య రాగానే తనే ప్రపంచం అవుతుంది.
ALSO READ :మళ్లీ ప్రేమలో పడ్డ శిఖర్ ధావన్! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Advertisement
ఆమె కోసం ఏం చేయడానికైనా సిద్దపడతాడు. కష్టపడి పనిచేస్తూ తన భార్యను మహరాణిలా చూసుకోవాలని అనుకుంటాడు. తన భార్య పిల్లలే ప్రపంచం అనుకుని వాళ్ల కోష్టపడుతూ వారికి ఎలాంటి అపాయం రాకుండా రక్షణగా ఉంటాడు. అయితే చిన్న చిన్న తప్పుల వల్ల భార్య భర్తల బంధం విచ్చిన్నం అవుతుంది.
Advertisement
తాజాగా భార్యలు చేసే కొన్ని తప్పుల వల్ల భార్యభర్తల మధ్య కలహాలు వస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం….భర్త ఇంట్లో లేని సమయంలో కొంతమంది భార్యలు ఫోన్ లో బిజీగా ఉండిపోతారు. అయితే ఫోన్ చూస్తే తప్పు లేదు కానీ ఇతరులతో చాటింగ్ చేయకూడదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో పరిచయ అయ్యే అపరిచిత వ్యక్తులతో ఎలాంటి స్నేహ సంబంధాలు పెట్టుకూడదని హెచ్చరిస్తున్నారు.
అదేవిధంగా భర్త లేని సమయంలో స్నేహితుడు అయినా సరే ఇతర పురుషులను ఇంటికి పిలవకూడదని మానిసిక నిపుణులు సూచిస్తున్నారు. అలా చేస్తే భర్తకు అనుమానం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక భర్త కష్టపడి ఇంటికి వస్తే భార్యలు సీరియల్స్ చూస్తూ ఇతరులతో టైమ్ పాస్ చేస్తూ సమయం గడపకుండా అతడికి ఇష్టమైన భోజనం వండిపెట్టడం అతడికి నచ్చిన విధంగా రెడీ అవ్వడం లాంటివి చేయాలని చెబుతున్నారు. అంతే కాకుండా భర్త పనిమీద భయటకు వెళ్లినప్పుడు అతడికి పదే పదే ఫోన్ లు చేసి ఇబ్బంది పెట్టకూడదని అవసరం ఉంటేనే ఫోన్ చేయాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.