Home » దసరా నుండి డిలీట్ చేసిన సీన్లు అంత దారుణంగా ఉన్నాయా..?

దసరా నుండి డిలీట్ చేసిన సీన్లు అంత దారుణంగా ఉన్నాయా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో నాని అంటే తెలియని వారు ఉండరు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే దూరిపోయే టాలెంట్ హీరో నాని కి ఉందని చెప్పవచ్చు. అలాంటి నాని దసరా సినిమాతో సరికొత్త లుక్ లో కనిపించారు. మాస్ లుక్ లో ఎంతోమంది అభిమానుల మనసును కొల్లగొట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అలాంటి దసరా సినిమా నుండి చాలా సీన్లు డిలీట్ చేశారట. డిలీట్ చేసిన కొన్ని సీన్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. మరి అవి ఎందుకు డిలీట్ చేసారో ఇప్పుడు తెలుసుకుందాం..

also read:Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు

Advertisement

నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ దసరా. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో దీక్షిత్ చనిపోయిన తర్వాత నాని కీర్తి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటాయి. అయితే ఈ సన్నివేశాల నుండి ఒక సీను డిలీట్ చేశారట. అలా డిలీట్ చేసిన సన్నివేశాన్ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కీర్తి సురేష్ తన పుట్టింటికి వచ్చి తన తల్లితో మాట్లాడుతున్న తరుణంలో తన అత్త వచ్చి కీర్తిని నాని ఇంటి దగ్గరికి తీసుకెళ్లి ఇదే నీ ఇల్లు లోపలికి వెళ్ళు అని బతిమిలాడడం, ఇది మొత్తం గోడ పక్కన ఉన్న నాని ఎమోషనల్ గా అనిపిస్తోంది.

Advertisement

also read:April 10th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

అయితే ఈ సీన్ చూసిన ఆడియన్స్ ఇంత మంచి సీన్ ఎలా తీసేసారంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా ఇందులో కీర్తి సురేష్ అంగన్వాడీ టీచర్ గా చేస్తుంది. అయితే అంగన్వాడి సెంటర్ లోని గుడ్లను దొంగిలించి ఇంట్లోకి తీసుకెళ్లే సన్నివేశాన్ని కూడా డిలీట్ చేయాలని అంగన్వాడి కార్యకర్తలు ధర్నా చేయడంతో ఆ సీన్ తొలగించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మూవి ఇప్పటికే వంద కోట్ల కలెక్షన్స్ సాధించి నాని కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

also read:సురేఖను దారుణంగా అవమానించిన స్టార్ హీరో భార్య.. చివరికి చిరు ఏం చేశారంటే..?

Visitors Are Also Reading