Home » చిరంజీవి నా పక్కనే కూర్చుంటావా..? అని అవమానించిన హీరోయిన్ ఎవరు ? ఎందుకు అన్నది ?

చిరంజీవి నా పక్కనే కూర్చుంటావా..? అని అవమానించిన హీరోయిన్ ఎవరు ? ఎందుకు అన్నది ?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా కసితో కష్టపడి ఎదిగారు చిరంజీవి. ఆయన ఎంతటి స్థాయికి ఎన్నో అవమానాలు పడ్డారట. అయినా భరించుకొని తాను అనుకున్న లక్ష్యానికి చేరుకునేందుకు కష్టపడుతూ వచ్చారు ఇంకా కష్టపడుతున్నారు. అలాంటి చిరంజీవిని అప్పట్లో ఆ హీరోయిన్ తీవ్రంగా అవమానించిందట.. మరి ఆ కథేంటో పూర్తిగా చూద్దాం.. చిరంజీవి తన కెరియర్ మొదలుపెట్టిన మొదటి రోజుల్లో అనేక అవమానాలు ఎదురయ్యాయి. కానీ చిరంజీవి మాత్రం ఈ అవమానాలు పట్టించుకోకుండా తాను వెళ్లాల్సిన గమ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేశారు.

Advertisement

Also Read:Where is Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. తప్పించుకున్న పుష్ప ఏమయ్యాడు?

తన అవమానాలను ఇతరులతో కూడా చర్చించకుండా తన లోపల దాచుకొని ముందుకు వెళ్లే వారట. అలాంటి చిరంజీవి మరియు మాధవి కలిసి ఒక సినిమాలో నటిస్తున్న సమయంలో ఆయన్ను తీవ్రంగా అవమానించిందట. మాధవి అప్పటికే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే వీరిద్దరూ కలిసి ఒక సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. షూటింగ్ అయిపోయాక వీరిద్దరికి వేర్వేరు హోటల్స్ లో బస ఏర్పాటు చేశారు. మరునాడు షూటింగ్ లొకేషన్స్ కు రావాలని నిర్మాత తన కారును పంపించారట. ముందుగా కారు హీరోయిన్ మాధవి ఉండే హోటల్ కి వెళ్లి తీసుకువస్తారు.

Advertisement

Also Read:కెరీర్ లేదు, డబ్బు లేదు కానీ రాజా రాణి డైరెక్టర్ అట్లీ భార్య కృష్ణ ప్రియా ఎందుకు ఇష్ట పడింది ? సినిమా కి ఆమెకి ఉన్న సంబంధం..?

ఇక వచ్చే దారిలోనే చిరంజీవి ఉండే హోటల్ ఉంది. ఆ హోటల్ వద్దకు రాగానే చిరంజీవి కూడా మాధవి పక్కనే కూర్చున్నారు. వెంటనే మాధవి మీరు నా పక్కన వద్దు ముందుకు వెళ్లి కూర్చోండి అంటూ అందట. అలా ప్రతిరోజు మాధవి వెనక సీట్లో కూర్చుంటే చిరంజీవి ముందు సీట్లో కూర్చునేవారట.. అలా చిరంజీవి ఆమె అవమానించిందని పట్టించుకోకుండా స్టార్ గా ఎదగాలనే కసితో ముందుకు సాగారు. పట్టుదలతో స్టార్ హీరో గా ఎదిగారు. ఆ తర్వాత మాధవికి అవకాశాలు తగ్గిపోయాయి. ఎంతోమంది స్టార్ హీరోయిన్లు కూడా చిరంజీవితో ఒక్కసారి నటించాలని అనుకునే స్థాయికి వచ్చారు. అలా చిరంజీవిని మాధవి అవమానించిందని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు చిరంజీవి.

Also Read:పెళ్లి త‌ర‌వాత విదేశాల‌కు మ‌కాం మార్చిన 10 మంది స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

Visitors Are Also Reading