కోలీవుడ్ అగ్ర దర్శకుడు ఎంతటి సంచలన విజయాలు అందించాడో అందరికీ తెలిసిందే. శంకర్ తొలి చిత్రం జెంటిల్ మేన్ లో హీరోగా తొలుత అనుకున్నది అర్జున్ ని కాదనే విషయం చాలా మందికి తెలియదు. యాక్షన్ కింగ్ అర్జున్ కంటే ముందే జెంటిల్ మేన్ కథ చాలా మంది హీరోల చేతుల్లోకి వెళ్లిందట.
Also Read : “బలగం” మూవీ గ్రామాల్లో ప్రదర్శిస్తే పోలీస్ కేసులు తప్పవా..?
Advertisement
కానీ కథ చివరికీ అర్జున్ వద్దకు రావడం వెనుక పెద్ద కథనే ఉంది. శంకర్ కెరీర్ ప్రారంభంలో అనుభవించిన స్ట్రగుల్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. దర్శకుడిగా మారడం వెనుక చాలా పెద్ద స్టోరీనే ఉంది. అసిస్టెంట్ దర్శకుడిగా శంకర్ తమిళ సూపర్ స్టార్ విజయ్ తండ్రి ఎస్.ఏ చంద్రశేఖర్ దగ్గర 14 సినిమాలకు అసిస్టెంట్ గా పని చేశారు. ఒకే దర్శకుడి వద్ద ఇన్ని సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పని చేసిన ఘనత శంకర్ కే దక్కుతుంది. తొలుత శంకర్ లో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించింది కూడా ఎస్.ఏ.చంద్రశేఖర్ కావడం విశేషం. చంద్రశేఖర్ తెలుగులో చిరంజీవి హీరోగా చట్టానికి కళ్లు లేవు, శోభన్ బాబు హీరోగా బలిదానం వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.
Advertisement
సహాయ దర్శకుడిగా, కో డైరెక్టర్ గా పూర్తి స్థాయిలో అనుభవం సంపాదించుకొని దర్శకత్వ ప్రయత్నాలు ప్రారంభించారు శంకర్. హీరోయిన్ ఓరియంటేడ్ సబ్జెక్. కానీ కమర్షియల్ గా ఆ సినిమా సక్సెస్ కాదనే మిత్రుల సలహాతో జెంటిల్ మేన్ కథ తయారు చేశాడు. కానీ నిర్మాతలు మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో శంకర్ తొలుత హీరోలకు కథ చెప్పి ఒప్పిద్దామని, ఆ తరువాత వారికి నచ్చితే నిర్మాతను వారే చూసి పెడతారనుకున్నారట. శరత్ కుమార్ వద్దకు ఈ కథ తొలుత వెళ్లింది. ఆయన కథ విని ఓకే చెప్పారు కానీ నిర్మాతను మాత్రం మీరే వెతుక్కోవాలని తేల్చేయడంతో శంకర్ కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. నిర్మాత కోసం వెతుకుతున్న సమయంలో మలయాళ నిర్మాత కుంజుమోన్ తమిళంలో చిత్రం తీస్తున్నారని తెలిసి ఆయన దగ్గరకు వెళ్లి జెంటిల్ మేన్ కథ వినిపించారు.
Also Read : శ్రీ లీలకు ఆ క్వాలిటీస్ ఉన్న భర్త కావాలట..!!
నిర్మాత కుంజుమోన్ కు కథ నచ్చి వెంటనే అడ్వాన్స్ చెక్కు ఇచ్చేశారట. దీంతో కథ సుఖాంతం అయింది. షూటింగ్ ప్రారంభిద్దామనుకునే లోపే హీరో శరత్ కుమార్ కి డేట్స్ ప్రాబ్లమ్స్ వచ్చి వేరే హీరోను చూసుకోమని శంకర్ కి చెప్పాడట. దీంతో మళ్లీ హీరోల కోసం వెతికాడు. రాజశేఖర్, కార్తిక్ తో సహా ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలకు జెంటిల్ మేన్ కథ వినిపించినప్పటికీ వారికి ఆ కథ నచ్చలేదట. చివరికీ అప్పుడే విడుదలైన అర్జున్ సినిమా చూసిన శంకర్.. తన కథకు అర్జున్ అయితే కరెక్ట్ సరిపోతాడని భావించాడట. ఇక ఆయనను కలిసి కథ చెప్పగానే వెంటనే ఒప్పేసుకున్నాడట. దీంతో అర్జున్ హీరోగా జెంటిల్ మేన్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళంతో పాటు తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ సాధించి దర్శకుడు శంకర్ తో పాటు అర్జున్ కి కూడా స్టార్ డమ్ తీసుకొచ్చింది. ఇక ఈ సినిమాను మిస్ చేసుకున్నందుకు చాలా మంది హీరోలు తరువాత బాధపడ్డారట.
Also Read : రెయిన్ బో సినిమాకి రష్మిక ఫస్ట్ ఛాయిస్ కాదు.. ఎవరంటే ?