చరిత్రలో మొట్టమొదటిసారి తెలుగు సినిమాకు ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట ఆస్కార్ ను గెలుచుకుంది. ఇక తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం అంటే మామూలు విషయం కాదు. దాంతో దేశ ప్రధాని నుండి రాజకీయ నాయకులు మరియు సినీ తారలు ఆస్కార్ టీం ను, అందులోని సభ్యులను అభినందిస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపించారు.
READ ALSO : IPL 2023 : షారుఖ్ ఖాన్, విరాట్ కోహ్లీ మధ్య ట్విట్టర్ వార్.. !
Advertisement
అయితే ఆస్కార్ నామినేషన్ కి అప్లై చేసే ప్రాసెస్ నుండి ఆర్ఆర్ఆర్ మూవీ క్యాంపైన్ బాధ్యతలు కార్తికేయ చూసుకున్నాడు. అందుకే ఆస్కార్ వేదికపై కీరవాణి కార్తికేయకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాడు. ఆస్కార్ ఇండియన్ సినిమాకు దక్కడంలో కార్తికేయ కీలక పాత్ర పోషించాడు. ఇటీవల కార్తికేయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక సంగతులు పంచుకున్నారు. తండ్రి రాజమౌళిని కార్తికేయ నాన్న అని పిలవరట. మొదటి నుండి బాబా అని పిలవడం అలవాటట.
Advertisement
READ ALSO : TS Constable : ఏప్రిల్ 2న పోలీస్ కానిస్టేబుల్ తుది రాతపరీక్ష..కచ్చితంగా ఈ రూల్స్ పాటించండి
అలానే పిలుస్తాడట. నేను జీవితంలో చెడు రోజులు మంచి రోజులు రెండు చూశాను. ఒకే టైంలో కేవలం నెలకు రూ. 3 వేలకు పార్ట్ టైం జాబ్ చేశాను. డబ్బుల కోసం కాదు. ఆత్మసంతృప్తి కోసం చేశాను. అది రాజమౌళి నుండి నేర్చుకున్నాను అన్నారు. కాగా రాజమౌళికి కార్తికేయ స్టెప్ సన్. రమా రాజమౌళి మొదటి భర్త సంతానమే కార్తికేయ. రాజమౌళితో ఆమెకు ఒక కూతురు ఉంది.
READ ALSO : SriLanka : క్రికెట్‌లో పరువు పోగొట్టుకున్న శ్రీలంక.. 44 ఏళ్లలో ఇదే తొలిసారి