ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా వారి కోసం ప్రత్యేకంగా ఆసుపత్రులు, హోటళ్లు, టీ స్టాళ్లు కూడా ఇప్పటికే దేశంలో అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పుడు దేశంలోనే మొదటిసారిగా ట్రాన్స్ జెండర్స్ కోసం ప్రత్యేకించి హెయిర్ సెలూన్ ఒకటి ఓపెన్ అయింది. ఇందుకోసం ముంబైలో ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేకంగా హెయిర్ సెలూన్ ని ప్రారంభించారు. దేశంలోనే ఇది ఫస్ట్ ట్రాన్స్ జెండర్స్ హెయిర్ సెలూన్.
Also Read : “గృహలక్ష్మి” సీరియల్ హీరో ‘నందు’ తాత కూడా నటుడని మీకు తెలుసా..?
Advertisement
ఈ సెలూన్ ను ఏడుగురు ట్రాన్స్ జెండర్స్ నిర్వహిస్తున్నారు. సెలూన్ వ్యవస్థాపకుల్లో ఒకరు అయినటువంటి జైనాబ్ మాట్లాడుతూ.. తమ కమ్యూనిటికీ చెందిన ప్రజలు నేటికి చాలా వివక్ష ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు. తమ అస్తిత్వం, సమాన హక్కుల కోసం వారు నిరంతర పోరాటం చేసినప్పటికీ వారు తమ లక్ష్యాన్ని పూర్తిగా చేరుకోలేకపోతున్నారని వాపోయారు. కానీ కొన్ని చోట్ల తమ పట్ల ప్రజల వైఖరి మారిందని చెప్పారు.
Advertisement
Also Read : అన్నదమ్ముల వివాదంపై మంచు మనోజ్ ఏమన్నారో తెలుసా ?
ఇక ఈ పథకం వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం తీసుకొచ్చినట్టుగా చెప్పారు. సమాజంలోని ప్రజలను శక్తివంతంగా తయారు చేయడానికి ఈ దశ చాలా ముఖ్యమైంది. అంతేకాదు.. ట్రాన్స్ జెండర్లరకు శిక్షణ, ఉపాధి కల్పించడానికి హెయిర్ సెలూన్ ప్రత్యేకించి ఏర్పాటు చేసినట్టుగా ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా వీరు అందరి మన్ననలు పొందుతున్నారు. చాలా వరకు ట్రాన్స్ జెండర్లు ఉపాధి లేక ప్రజలను పీడ్చుకుతింటుండటం మనం నిత్యం ఏదో ఓ సదర్భంలో చూస్తుంటాం. ఉపాధి కల్పించాలనే ఉపాయం చాలా గొప్పదనే చెప్పవచ్చు.
Also Read : శంకర్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర అదేనా ?