Telugu News » Blog » “గృహలక్ష్మి” సీరియల్ హీరో ‘నందు’ తాత కూడా నటుడని మీకు తెలుసా..?

“గృహలక్ష్మి” సీరియల్ హీరో ‘నందు’ తాత కూడా నటుడని మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

సినిమా ఇండస్ట్రీలలో కేవలం సినిమాలే కాకుండా సీరియల్ లో కూడా మంచి ఆదరణ ఉంది. కథ బాగుంటే సీరియల్స్ కూడా సినిమా రేంజ్ లో గుర్తింపు అందుకుంటాయి. ఇందులో చేసే నటీనటులు కూడా సినిమా హీరో హీరోయిన్ల రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంటున్నారు.. మొన్నటివరకు కార్తీకదీపం సీరియల్ టాప్ రేటింగ్స్ లో దూసుకుపోయింది. ఇందులో చేసిన ప్రేమీ విశ్వనాధ్ కి ఎంతటి గుర్తింపు వచ్చిందో మనందరికీ తెలుసు. ఈ రేంజ్ లోనే స్టార్ మా లో ప్రసారమవుతున్న గృహలక్ష్మి సీరియల్ కూడా మంచి గుర్తింపు అందుకుంది.

Advertisement

also read:40 ఏళ్లు దాటిన మహిళలు భర్త దగ్గర ఇదే కోరుకుంటారట..!!

ఈ క్రమంలోనే స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఇందులో నటించే నటీనటులు కూడా ప్రజల్లో ఎంతో ఆదరణ పొందుతున్నారు.. రోజురోజుకు ఎంతో రసవత్తరంగా సాగుతున్న ఈ ధారావాహిక లో తులసి పాత్రలో కస్తూరి లీడ్ రోల్ పోషిస్తుంది. ఇక తులసికి భర్తగా నందు పాత్రలో హరి కృష్ణ హీరోగా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సీరియల్లో తులసి నందు పిల్లలు పెద్దయ్యాక విడాకులు తీసుకుంటారు. దీనికి ప్రధాన కారణం నందు లాస్య అనే ఆమెను ప్రేమించి దగ్గరవుతాడు. దీనివల్లే తులసి తో గొడవలు పెట్టుకుని విడాకులు తీసుకుంటారు. ఆ తర్వాత వీరంతా కలిసి ఒకే దగ్గరే ఉంటూ బిజినెస్ చేస్తుంటారు. ఈ విధంగా రోజుకో మలుపు తిరుగుతున్న ఈ సీరియల్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది.

Advertisement

also read:నిహారిక, చైతన్య మధ్య చిచ్చు పెట్టింది అతనేనా..?

ఇదంతా పక్కన పెడితే ఈ సీరియల్లో నందు పాత్రలో నటిస్తున్న హరికృష్ణ సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. ఈయన అలనాటి నటుడైన బాలయ్యకు మనవడవుతాడట. కానీ ఆయన సపోర్టు మీద ఏమాత్రం ఆధారపడకుండా తనకు తాను సొంత ఇమేజ్ వెయిట్ చేసుకున్నాడు. తెనాలిలో పుట్టి పెరిగిన హరికృష్ణ పై చదువులు మొత్తం చెన్నైలో కంప్లీట్ అయ్యాయి. నటనపై ఉన్న ఆసక్తితో మొదటిసారిగా 2008లో హ్యాపీడేస్ అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం సక్సెస్ఫుల్ నటుడిగా దూసుకుపోతున్నారు.

Advertisement

also read:బ‌ల‌గం సినిమా డైరెక్ట‌ర్ వేణుకు దిల్ రాజు కారుతో పాటూ అన్ని కోట్ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చాడా..?

You may also like