Home » మీ మొబైల్ కి హాని చేసే చెడు అలవాట్లు ఇవే..!

మీ మొబైల్ కి హాని చేసే చెడు అలవాట్లు ఇవే..!

by Anji

ఎలిమెంటరీ స్కూల్ లో పిల్లలకు టీచర్లు మంచి, చెడు గురించి చెబుతుంటారు. మన అలవాట్లు మన ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా మనం రోజూ వాడే ఫోన్ విషయంలో మనం రోజు చేసే పనులే ఫోన్ ఆరోగ్యాన్ని.. అంటే దాని పనితీరును ప్రభావితం చేస్తుంది. దాని లైఫ్ ని పెంచడమో.. తగ్గించడమో చేస్తుంది. ఫోన్ లో అత్యంత కీలకమైనటువంటి భాగం బ్యాటరీనే. బ్యాటరీని కాపాడుకుంటే ఫోన్ కాపాడుకున్నట్టే. బ్యాటరీని కాపాడుకోవాలంటే చార్జీంగ్ పెట్టే విషయంలో కొన్ని పద్దతులను పాటించాలని నిపుణులు పేర్కొంటున్నారు. చాలా మందికి చెడ్డ అలవాట్లు ఉన్నాయి. ఆ అలవాట్లను మార్చుకోవడం ద్వారా మన ఫోన్  లైఫ్ టైమ్ ను పెంచుకోవచ్చు.  ఫోన్ బ్యాటరీకి చెడు చేసే మూడు ప్రధాన చెడు అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం.  

Also Read :  ఏప్రిల్ 01న బ్యాంకులను ఎందుకు బంద్ చేస్తారో తెలుసా ?

స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో సర్వసాధారణమైన చెడు అలవాటు ఎందుకు అంటే ఫోన్ ను ఫోన్ కేసులో ఉంచి ఛార్జింగ్ పెట్టడం ద్వారా ముఖ్యంగా రెండు సమస్యలుంటాయి. బ్యాటరీ హీట్ ఎక్కడం అయితే.. రెండోది చార్జింగ్ కనెక్టర్ తెగిపోవడం.నాసిరకం మెటీరియల్ తో తయారయ్యే ఫోన్ కేసుల వల్ల చార్జింగ్ కేబుల్ రాపిడికి గురై క్రమంగా మొత్తానికే తెగిపోతుంది. కేసులో ఉంచి చార్జింగ్ పెడితే ఫోన్ బాగా వేడెక్కుతుంది. వేడెక్కడం వల్ల చార్జింగ్ వేగం తగ్గిపోతుంది. అంతేకాదు.. బ్యాటరీ జీవితకాలం కూడా తగ్గిపోతుంది. మనం స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసినప్పుడు దీంతో పాటు వచ్చే చార్జర్ లు ఫాస్ట్ గా చార్జింగ్ అయ్యేవి ఉంటాయి. ప్రతిరోజూ ఫాస్ట్ చార్జర్ వినియోగించడం కూడా చెడ్ చార్జింగ్ అలవాటు కిందే వస్తుంది. 

Also Read :  విటమిన్ల లోపాన్ని తెలిపే సంకేతాలు ఇవే..!

ఎందుకు అంటే స్మార్ట్ ఫోన్ 40 W లేదా అంతకంటే స్పీడ్ కలిగిన చార్జర్ వస్తాయి. ఈ చార్జర్ లనే వినియోగిస్తే ఒత్తిడి పడి ఏడాదిలోపే ఫోన్ లో బ్యాటరీ క్షీణిస్తుంది. ఫాస్ట్ చార్జర్ లకు బదులు బయట దొరికే నాణ్యమైన స్లో చార్జర్ లను కొని వినియోగించడం చాలా ఉత్తమం. ఎప్పుడైనా వేగంగా చార్జింగ్ కావాలనుకున్నప్పుడు మాత్రం ఫాస్ట్ చార్జర్ లను వినియోగించుకోవచ్చు. చార్జింగ్ కోసం రోజు ఫాస్ట్ చార్జర్ లను ఉపయోగించడం చెడు అలవాటును మానుకోవాలి. మీ స్మార్ట్ ఫోన్ లో చార్జింగ్ 50 శాతం కంటే తగ్గే వరకు చూస్తున్నట్టయితే అది చాలా చెడ్డ అలవాటు. ఫోన్ చార్జింగ్ 5 శాతం కంటే దిగువకు పడిపోయినప్పుడు బ్యాటరీపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీంతో బ్యాటరీ లైఫ్ టైమ్ గణనీయంగా తగ్గుతుంది. ఎప్పుడైనా ఫోన్ చార్జింగ్ 10 నుంచి 15 శాతం ఉన్నప్పుడే తిరిగి చార్జింగ్ పెట్టుకోండి. ఎప్పుడో ఒకసారి వీలు పడక ఫోన్ లో చార్జింగ్ 5 శాతం దిగువకు పడిపోతే పర్వాలేదు కానీ ప్రతి రోజు 5 శాతానికి తగ్గే వరకు చూడటం బ్యాటరీకి మంచిది కాదు. 

Also Read :  ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. ఇకపై బస్సుల్లో ఉచితంగా వైఫై..!

Visitors Are Also Reading