శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఇవాళ హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఉగాది వేడుకలు నిర్వహించారు. పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు పంచాంగ శ్రవణం చేసారు. వేద పండితులు చిలుకూరు శ్రీనివాస మూర్తి పంచాంగం పఠనం చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్ తో సహా పలువురు నాయకులు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు.
Also Read : భోజనానికి ముందు బాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!
Advertisement
రాష్ట్ర రాజకీయాల్లో కొత్త కూటములు ఏర్పడుతాయని చెప్పారు. అదేవిధంగా రేవంత్ రెడ్డికి ఈ ఏడాది బాగా కలిసి వస్తుందని.. ఆయనకు అందరూ సహకరించాలన్నారు. నాయకులందరూ కలిసి నడవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన పెరుగుతుందని.. సరిహద్దు వివాదాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోకుండా ప్రజలు పాలకపక్షం వైపు ఉండాలన్నారు.
Advertisement
తెలుగు రాష్ట్రాలలో అల్లర్లు జరుగుతాయని, ప్రజలను అవి ఇబ్బంది పెడతాయని చెప్పారు. తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో నష్టం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ శ్రేణులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. అధికారం ఒక అవకాశం మాత్రమే అని, ప్రజలకు నచ్చితే తప్పకుండా అధికారం ఇస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పూర్తితో ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజలకు నచ్చేవిధంగా నడుచుకోవాలని కార్యకర్తలకు సూచించారు.
Also Read : దర్శకుడు రాజమౌళి గురించి సీనియర్ నటి కాంచన సెన్సేషనల్ కామెంట్స్..!