చైత్ర మాసంలోని శుక్ల పక్ష పాడ్యమి రోజు ఉగాది పండుగ జరుపుకుంటాం. ఈ రోజు నుంచి తెలుగు వారికి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది శోభ కృత్ నామ సంవత్సర ఉగాది పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది మార్చి 22న ఉగాది పండుగ. ఈ రోజు నుంచి మనుషుల జీవితంలో సరికొత్త మార్పులు వస్తాయని.. 12 రాశుల్లో విభిన్నమైన మార్పులుంటాయని నమ్మకం. అందుకోసమే పంచంగ శ్రవణం ద్వారా ఈ ఏడాదిలో రానున్న లాభ, నష్టాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఉగాది పండుగ నుంచి మూడు రాశుల వారికి గజకేసరి యోగం లభించనుంది. ఉగాది నుంచి మీన రాశిలో బృహస్పతి, చంద్రుడు కలువనున్నారు. కొన్ని రాశులకు గజకేసరి రాజయోగాన్ని కలిగిస్తుంది.
Also Read : Happy Ugadi 2023 Wishes, Greetings, Messages Quotes, Subhakankshalu in Telugu తెలుగు ఉగాది శుభాకాంక్షలు
Advertisement
మీన రాశిలో ఏర్పడనున్న గజకేసరి రాజయోగంతో మూడు రాశులవారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆర్థికంగా అన్ని విధాలుగా లాభాలను అందుకుంటారు అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. గజకేసరి రాజయోగం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ సులభంగా ఎదుర్కొంటారు. సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. గజకేసరి యోగా అంటే ఏంటి..? మూడు రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గజకేసరి అంటే అర్థం ఏంటంటే.. గజం అంటే ఏనుగు అని, కేసరి అంటే సింహం. ఏనుగు సింహం రెండు మంచి బలమైన జంతువులు. దీంతో గజకేసరిరాజయోగంతో ఆయా రాశులకు చెందిన వ్యక్తులు తమ తెలివి తేటలను ప్రతిభ పాటవాలను ప్రదర్శిస్తారని చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారని విశ్వాసం. అందుకే గజకేసరి రాజయోగం అంటే సకల శుభాలను ఇచ్చే రాజయోగం అంటారు.
Advertisement
Also Read : కరీంనగర్ లో తీగ లాగితే విదేశాలలో డొంక కదిలింది.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి..!
సింహరాశి :
ఉగాది పండుగ రోజు నుంచి మీన రాశిలో ఏర్పడనున్న గజకేసరి రాజయోగంతో ఈ రాశి వ్యక్తులు తిరుగులేని జాతకులగా మారుతారు. ఈ ఏడాది వీరికి శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలను అందుకుంటారు. వృత్తి, విద్య, వ్యాపార రంగాల్లో అన్నింటిలో లాభం ఉంటుంది. ఈ రాశి వారు గజకేసరి యోగంతో ఆర్థికంగా లాభాలను పొందుతారు.
Also Read : Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి
మీన రాశి :
ఈ రాశి వారికి యోగంతో విశేష శుభాలను పొందుతారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఏ పని ప్రారంభించినా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు. విద్యారంగంలోని వారు విశేషమైన కీర్తి ప్రతిష్టలను పొందుతారు. అన్నింటిలో మంచి విజయాలను సాధిస్తారు. వీరు ఏ పని ప్రారంభించినా సమయం అనుకూలిస్తుంది.
మిథున రాశి :
ఈ రాశి వారికి రాజయోగంతో అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశికి చెందిన వ్యక్తుల జాతకంలో దేవ, గురు, బృహస్పతి ఉగాది నుంచి ఆధిపత్యం చెలాయించే స్థానంలో ఉంటాడు. ఈ రాశి గల వ్యక్తులు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ ఏడాది శుభ ప్రదంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగ రంగంలోని వారు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.
Also Read : Ugadi 2023 : ఉగాది నుంచి ఈ రాశుల వారికి ధనలాభం