Manchu Manoj Wife Mounika Reddy: మంచువారింట పెళ్లిబాజాలు మోగుతున్నాయి. మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మనోజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మోహన్ బాబు వారసుడుగా అడుగుపెట్టిన మనోజ్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అభిమానులను సంపాదించుకున్నాడు. మనోజ్ కు సినిమాల కంటే ఆయన ముక్కుసూటితత్వం…నిజాయితీ వల్లనే ఎక్కువ మంది అభిమానులు అయ్యారు. ఇదిలా ఉండగా మనోజ్ కు ఇదివరకే పెళ్లి అయ్యింది.
Advertisement
కానీ మొదటి భార్యతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నాడు. దాంతో మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరా అని నెటిజన్ లు ఆరాతీసే పనిలో పడ్డారు. కాగా మనోజ్ నేడు పెళ్లికూతురు భూమా మౌనికా రెడ్డి అంటూ తనకు కాబోయే భార్యను అభిమానులకు నెటిజన్ లకు పరిచయం చేశాడు. ఇక భూమా మౌనికారెడ్డి మరెవరో కాదు.
also read :షాకింగ్ రేంజ్ లో సమంత సంపాదన…ఇన్స్టాగ్రామ్ ద్వారానే నెలకు అన్ని కోట్లు తీసుకుంటుందా.?
Advertisement
ఆమె తండ్రి దివంగత నాయకుడు…ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి భూమా నాగిరెడ్డి. ఇదిలా ఉంటే మంచు ఫ్యామిలీతో భూమా ఫ్యామిలీకి ఎప్పటి నుండో మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే మనోజ్ మౌనికారెడ్డి మొదటి వివాహానికి హాజరయ్యాడు.
మౌనికారెడ్డికి మొదట బెంగుళూరుకు చెందిన గణేష్ రెడ్డి అనే యువకుడితో 2016 లో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల తరవాత కుమారుడు జన్మించాడు. కాగా ఇద్దరి మధ్య మనస్పర్దలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇక మనోజ్ కూడా ప్రణతిరెడ్డిని పెళ్లి చేసుకుని ఆ తరవాత విడాకులు తీసుకున్నాడు. అయితే మనోజ్ మౌనిక ల మధ్య ముందే పరిచయం ఉండగా అది కాస్తా ప్రేమగా మారడంతో నేడు వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు.
ALSO READ :మొదటిసారి కాబోయే భార్య ఫోటోను షేర్ చేసిన మనోజ్…నెట్టింట వైరల్..!