Home » జగపతి బాబు భార్య గురించి ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా ?

జగపతి బాబు భార్య గురించి ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా నాకు తిక్కుంది.. కానీ దానికి ఓ లెక్క ఉంది అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ డైలాగ్ ని టాలీవుడ్ లో చాలా మందికి అప్లై చేయవచ్చు. అందులో ముఖ్యంగా జగపతిబాబుని ఉదాహరణ తీసుకోవచ్చు. ఇటీవలే హీరో జగపతిబాబు సైతం కొన్ని సంచలన కామెంట్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మొదటి నుంచి కాస్త భిన్నమైన ధోరణి కలిగినటువంటి జగపతిబాబు ఎవరిని పెద్దగా ఇబ్బంది పెట్టడు. అయితే ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు జగపతి బాబు. 

Advertisement

ముఖ్యంగా అసలు పెళ్లి పై తనకు నమ్మకం లేదని..  తన పెద్ద కూతురు కి పెళ్లి చేసుకుంటాను అంటే పెళ్లి చేశాను.  కానీ అది తనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేని వ్యవహారం అని తేల్చి చెప్పాడు. అంతేకాదు.. చిన్న కూతురుకి పెళ్లి చేసుకోవద్దని కూడా సలహా ఇచ్చాడట జగపతి బాబు.  ఓసారి పెద్ద కూతురు వచ్చి తాను పిల్లల్ని వద్దనుకుంటున్నానని చెబితే సంతోషంగా ఓకే చెప్పాడట. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయన అభిమానులు జగపతిబాబుకి ఏమైంది అనే ఆలోచనలో పడ్డారు. ఇదంతా పక్కకు పెడితే అసలు ఆయన భార్య లక్ష్మి కూడా జగపతిబాబుకు ఇంతలా సపోర్ట్ చేయడం చాలా ఆసక్తికరంగా మారింది. జగపతిబాబు ఏం చేసినా ఆమె అస్సలు ఎదురు చెప్పదు. ఎప్పుడూ కూడా వ్యతిరేకించలేదు. జగపతిబాబు భార్య పేరు లక్ష్మి. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమే. 

Advertisement

Also Read :   మహాశివరాత్రి స్పెషల్‌.. ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు ఇవే

Manam News

పెళ్లి అయిన తొలినాళ్లలో అసలు ఇండస్ట్రీకి రాను అని తల్లికి మాట ఇచ్చిన జగపతి బాబు మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు.  అయినప్పటికీ కుటుంబం అతడినీ స్వాగతించింది. వ్యసనాలతో ఆస్తిని మొత్తం పోగొట్టుకున్నా  కూడా లక్ష్మీ ఏ రోజు బయటకు వచ్చి ఒక మాట కూడా అనలేదు. తన భర్తకు చేదోడు వాదోడుగానే ఉన్నది. సొంత ఇంటిని సైతం కోల్పోయే పరిస్థితి వచ్చిన జగపతిబాబు వ్యవహార శైలి పై ఆమె ఆవేదన వ్యక్తం చేయలేదు. ఇక పిల్లల విషయంలో కూడా  జగపతిబాబు మనస్తత్వాన్ని ఆమె సమర్థిస్తూ రావడం విశేషం. అందుకే జగపతిబాబు, లక్ష్మీ  మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా ఉంటారు. ఆమె మీడియాకు అసలు కనిపించదు. ఒక భార్యగా తాను చేయాల్సిన పనిని మాత్రం చేస్తూ వెళ్తుంది. ఇలా వీరి జీవితం కొనసాగుతుంది.  

Also Read :  నాన్న చివరి కోరిక తీర్చుతూనే అమ్మ ప్రాణాలను విడిచింది.. ఎమోషన్ గా ఘంటసాల తనయుడు..!

Visitors Are Also Reading