Home » దేవాల‌యాల్లో హార‌తిని క‌ళ్లకద్దుకోకూడ‌దు.. ఎందుకో తెలుసా?

దేవాల‌యాల్లో హార‌తిని క‌ళ్లకద్దుకోకూడ‌దు.. ఎందుకో తెలుసా?

by Bunty
Ad

మ‌నం ఎప్పుడు దేవాల‌యాల్లోకి వెళ్లిన అక్క‌డ అయ్య‌గార్లు మ‌న‌కు దేవుని హార‌తి ఇస్తూ ఉంటారు. అయితే చాలా మంది ఆ దేవుని హారతిని క‌ళ్ల‌కద్దుకుంటారు. మ‌రి కొంత మంది అయ్య‌గార్లు ఇచ్చే దేవుని హార‌తిని ద‌ణ్ణం పెట్టుకుంటారు. అయితే దేవుని హార‌తిని క‌ళ్లక‌ద్దుకోవాలా లేదా ద‌ణ్ణం పెట్టుకోవాల అని ఆలోచిస్తుం ఉంటారు. అయితే దీని పై చాలా మందికి పూర్తి క్లారిటీ ఉండదు. అయితే ఇప్ప‌డు మ‌నం దేవాల‌యాల్లో ఇచ్చే దేవుని హార‌తిని క‌ళ్లకద్దుకోవ‌చ్చా..? లేదా ద‌ణ్ణం పెట్టు కోవ‌చ్చా..? ఈ రెండింటిలో ఏది చేస్తే మంచిది అని తెలుసుకుందాం.

Advertisement

Advertisement

నిజానికి దేవాల‌యాల్లో ఇచ్చే దేవుని హార‌తిని క‌ళ్లక‌ద్దుకోకూడ‌ద‌ని పండితులు చెబుతారు. ఆ దేవుని హార‌తిని క‌ళ్లక‌ద్దుకోకూండా కేవ‌లం ద‌ణ్ణం మాత్ర‌మే పెట్టుకోవాల‌ని అంటారు. హారతి ఇతి హారతి అంటారు దృష్టిదోషాన్ని హార‌తి తిసివేస్తుంది. అందుకే కొంత మంది హార‌తిని నీరాజనం అని కూడా అంటారు. దేవాల‌యాల‌కు దేవుడిని ద‌ర్శించు కోవ‌డానికి వ‌చ్చిన వాళ్ల పై దిష్టి పడుతుంది. ఆ దృష్టిదోషం తొలగటానికి అయ్య‌గార్లు మ‌న‌కు దేవునికి హారతి ఇచ్చి మ‌న‌కు చూపిస్తారు. అప్పుడు మ‌నం దానికి ద‌ణ్ణం పెట్టుకోవాలి. అలాగే మ‌న ఇంట్లో శుభ‌కార్యాలు జరిగితే కూడా హార‌తి ఇస్తాం అప్పుడు కూడా హార‌తికి ద‌ణ్ణం మాత్ర‌మే పెట్టుకోవాలి. అలాగే చిన్న పిల్ల‌లకు కూడా హార‌తి తో దిష్టి తీస్తారు. త‌ర్వాత ఆ హార‌తిని ఇంటికి దూరంగా ప‌డేస్తారు. అయితే కొంత మంది దేవుని హార‌తిని క‌ళ్లుక‌ద్దుకుంటారు. ఎక్కువ గా శివ భ‌క్తులు హార‌తిని క‌ళ్లకద్దుకుంటారు.

Visitors Are Also Reading