దేశ వాణిజ్య రాజధాని ముంబయి కి భారతదేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా పేరు ఉంది. ఇక్కడ అన్ని సలక సౌకర్యాలతో ఇల్లు కొనుగోలు చేయాలంటే కోట్ల రూపాయలు కుమ్మరించాల్సిందే. సాధారణ అపార్టుమెంట్ ధర రూ.కోటి వరకు ఉంటుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక లగ్జరీ అపార్టుమెంట్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. రూ.కోటి పై మాటే.. తాజాగా ముంబయిలో ఓ అపార్టుమెంట్ లోని పెంట్ హౌస్ కళ్లు చెదిరే ధరకు అమ్ముడు అయింది. ఎంత రూ.50కోట్లు లేదా రూ.100 కోట్ల అనుకుంటున్నారేమో.. అది ఏం కాదు.. అక్షరాలా రూ.230 కోట్లు. పెంట్ హౌస్ కి అంత ధర ఎందుకు..? అని మీరు ఆశ్చర్యపోకండి.
Advertisement
ఇప్పటివరకు భారత్ లో జరిగిన సింగిల్ అపార్టుమెంట్ డీల్స్ లో ఇదే అత్యంత ఖరీదైన డీల్ గా రియల్ ఎస్టేట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2023లో ముంబైలో జరిగిన రెండో అతిపెద్ద డీల్ కూడా ఇదే అని చెబుతున్నారు. ముంబయిలోని వర్లీ ప్రాంతంలోని డాక్టర్ అనిబిసెంట్ రోడ్డులో ఒబెరాయ్ రియాల్టి సంస్థ, సహానా గ్రూప్ అనే మరో రియల్ ఎస్టేట్ సంస్థతో కలిసి 360 వెస్ట్ అనే పేరుతో లగ్జరీ అపార్ట్ మెంట్ ను నిర్మిస్తోంది. ఇందులో టవర్ బీలో 63వ అంతస్తులో 29,885 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ లగ్జరీ అపార్టుమెంట్లను నిర్మించింది.
Advertisement
Also Read : చిరు ఫేవరెట్ హీరోయిన్ ఆవిడే.. ఆమెలో నచ్చిన క్వాలిటీస్ ఇవేనట..!!
ట్రిపుల్ బెడ్ రూమ్ పెంట్ హౌస్ ని వెల్స్పన్ గ్రూపు చైర్మన్ బీకే గొయెంకా రూ.230.55 కోట్లకు కొనుగోలు చేసారు. కొద్ది రోజుల కిందట ఇదే అపార్టుమెంట్ లో డీమార్ట్ అధిపతి రాధాకిషన్ దమానీ కుటుంబం రూ.1,238 కోట్లతో 28 ప్లాట్లను కొనుగోలు చేసింది. ముంబయి నగరంలో ఖరీదైన ప్రాంతం, బీచ్ వ్యూ వంటి కారణాలతో ఇక్కడ అపార్టుమెంట్లు ఇంత ఖరీదైన ధర పలుకుతున్నాయని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : వేసవి కాలంలో గోరు వెచ్చని నీరు తాగితే ఏమవుతుందో తెలుసా ?