Telugu News » Blog » చిరు ఫేవరెట్ హీరోయిన్ ఆవిడే.. ఆమెలో నచ్చిన క్వాలిటీస్ ఇవేనట..!!

చిరు ఫేవరెట్ హీరోయిన్ ఆవిడే.. ఆమెలో నచ్చిన క్వాలిటీస్ ఇవేనట..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి రూటే సపరేటు.. ఆయన తాజాగా వాల్తేరు వీరయ్య మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా తమన్నా మరియు కీర్తి సురేష్ కనిపించనున్నారట. అయితే తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మనకు తెలియని కొన్ని విషయాలను బయటపెట్టారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలు పంచుకున్నారు. తన సినీ కెరియర్లో ఆయనతో నటించిన హీరోయిన్స్ గురించి చాలా విషయాలను బయటపెట్టారు.

Advertisement

రాధా, రాధిక, విజయశాంతి, మాధవి, శ్రీదేవి అగ్ర కథానాయకల గురించి చెప్పుకొచ్చారు. అప్పట్లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న వారి గురించి యాంకర్ ప్రశ్నించగా.. రాధిక శరత్ కుమార్, విజయశాంతి రాధా, శ్రీదేవి లాంటి స్టార్లు ఎవరు బెస్ట్ అని చెప్పడానికి మెగాస్టార్ నిరాకరించారు. అందరితోనూ మంచి రిలేషన్ ఉందని మా మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ఉండేదని అన్నారు. వారిలో ఒక్కో హీరోయిన్ కు ఒక్కొక్క ప్రత్యేకత ఉందని చెప్పుకొచ్చారు.

Advertisement

ఇందులో రాధిక సహజంగా నటిస్తుందని, అలాగే తనతో డ్యాన్స్ చేసే విషయంలో రాదా ఫర్ఫెక్ట్ అని తన పాత్రలో తనను తాను మార్చుకునే గొప్పతనం విజయశాంతి సొంతమన్నారు. అలాగే శ్రీదేవితో కూడా మంచి రిలేషన్ ఉన్నదని చెప్పుకొచ్చారు. ఆమె తనకు ఎప్పుడు ఫేవరెట్ హీరోయిన్ అని అన్నారు. శ్రీదేవితో పనిచేసి ప్రతి ఒక్క క్షణాన్ని ఆస్వాదించానని తెలిపారు. తెలుగు సినిమాల్లో తమ జంట ఇప్పటికి కూడా ఉత్తమ జంటగానే ఉంటుందన్నారు. ఈ విధంగా తనకి ఇష్టమైన హీరోయిన్ గురించి బయటపెట్టేశారు చిరంజీవి.

Advertisement

also read:

You may also like