ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ భారత్ పే పై ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ అష్నిర్ గ్రోవర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత భారత్ పే సీఈఓ భవిక్ కొలదియా 15 కోట్ల మంది భారత్ పే యూజర్ల డేటా చౌర్యానికి పాల్పడినట్టు పేర్కొన్నారు. అదే అంశంపై NPCI కి ఓ లేఖ రాసారు.
Advertisement
భారత్ పే యూజర్ల డేటా ఉల్లంఘనతో యూజర్ల డేటా గోప్యత భగ్నమైందని ఆరోపిస్తూ.. NPCI కి రాసిన లేఖలో గ్రోవర్ వివరించారు. అంతేకాదు.. క్రెడిట్ కార్డు మోసంలో భవిక్ గతంలో దోషిగా తేలాడని దాదాపు 18 నెలల పాటు గృహ నిర్భంధంలో ఉంచిన తరువాత అతన్ని భారత్ కి తరలించినట్టు గుర్తు చేశారు.
Advertisement
Also Read : భర్తకు తెలియకుండా ఆన్లైన్ యాప్ లో పెట్టుబడులు…చివరికి సినిమా రేంజ్ ట్విస్ట్..!
ఫేక్ టికెట్ ఉపయోగించి గుజరాత్ కి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అతనిపై ఢిల్లీ ఎయిర్ ఫోర్టులో ఎఫ్ఐఆర్ నమోదు అయినట్టు గ్రోవర్ వెల్లడించారు. అందుకు సంబంధించినటువంటి పలు ఆధారాలు తన వద్ద ఉన్నాయని వెల్లడించారు. గ్రోవర్ చేస్తున్నటువంటి ఆరోపణలపై భారత్ పే కంపెనీ స్పందించింది. ముఖ్యంగా కంపెనీ నుంచి తొలగించారనే కక్షతోనే గ్రోవర్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని.. భారత్ పే సీఈఓ భవిక్ కొలదియా పేర్కొన్నారు.
Also Read : అమిగోస్ సినిమాతో కళ్యాణ్ రామ్ కి మరో బ్లాక్ బస్టర్ పడ్డట్టేనా ?