ప్రేమ అన్నమాటకు సంబంధించి మనలో చాలా మనోభావం ఉంటుంది. దాని గురించి రకరకాల ఊహలు, నిర్వచనాలు చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఇష్టపడిన అమ్మాయి తన ప్రేమను ఒప్పుకుంటే అతడే మహారాజు. ప్రేమలో మునిగిపోయిన ప్రేమికులు ఏం చేస్తారో చెప్పడం చాలా కష్టం. కొంతమంది చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోతారు. మరికొంతమంది ఎవ్వరూ చూడకుండా జాగ్రత్తగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఏదో ఒకటి ఇచ్చుపుచ్చుకుంటూ ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే ప్రేమ గురించి ఎంత చెప్పినా ఓ మాట మిగిలే ఉంటుంది.
Advertisement
అయితే, తాజాగా తన ప్రేమ కోసం, దండకారణ్యం దాటుకుని..నది ప్రవాహానికి ఎదురీది బంగ్లాదేశ్ నుంచి ఏకంగా భారత్ కు చేరుకుంది ఓ అమర ప్రేమికురాలు. ఆమె పేరు కృష్ణా మండల్. అతని పేరు అబిక్ మండల్. ఇద్దరు ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ అయ్యారు. ఇరువురి అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ప్రియుడిని చేరుకోవడానికి ఆమెకు పాస్పోర్ట్ లేదు.
Advertisement
ఎలాగైనా తన ప్రియుడిని పెళ్లాడి అతనితో జీవితం పంచుకోవాలన్న బలమైన కోరికతో ఆమె సుందర్ బన్స్ అడవుల గుండా ప్రయాణించింది. బెంగాల్ టైగర్స్ మరియు ఇతర క్రూర జంతువులు తిరిగే మాన్గ్రోవ్ అరణ్యాలలో మట్టి రోడ్లలో ప్రయాణించి ఎన్నో ఇబ్బందులు పడింది. మార్గమధ్యంలో మాల్టా నదిని దాటవలసి వచ్చింది. గంటకు పైగా నదిలో ఈదుతూ అవతలి వైపుకు చేరింది. వెస్ట్ బెంగాల్ కి దక్షిణాన ఉన్న 24 పరగనాస్ ఏరియాలో కృష్ణ అబిక్ ని కలుసుకుంది. తర్వాత ఇద్దరూ కలిసి కలకత్తా చేరుకొని ఖాళీగాట్ వద్ద పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ కథ గురించి విన్న ప్రతి ఒక్కరు కృష్ణ తెగువని చూసి ముచ్చటపడి ఆమె ధైర్యాన్ని కొనియాడుతున్నారు.
read also : Waltair Veerayya : “వాల్తేరు వీరయ్య” ఓటిటి రిలీజ్ డేట్ పిక్స్..స్ట్రీమింగ్ ఎందులో అంటే !