ప్రస్తుతం ప్రపంచంలోనే బెస్ట్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ గా గుర్తింపు సంపాదించుకుంది వాట్సాప్. యూజర్ల అవసరానికి అనుగుణంగా వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ని అందిస్తూ వస్తోంది. చాలా మంది ప్రస్తుతం తమ బిజినెస్ యాక్టివిటిస్, జాబ్ రిలేటేడ్ వర్క్ కి కూడా వాట్సా్ ని ఓ ప్లాట్ ఫాంగా వినియోగిస్తున్నారు. అవసరాలకు తగినట్టుగా దీనిని ఉపయోగించుకోవచ్చు. కొంత మంది అయితే పాజిటివ్ అంశాలకు వినియోగిస్తే.. మరికొందరూ నెగిటివ్ అంశాలకు కూడా వాట్సాప్ ని వినియోగిస్తున్నారు. అయితే ఒకే అకౌంట్ ని రెండు ఫోన్లలో వినియోగించేందుకు వాట్సాప్ వీలు కల్పిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండానే రెండు స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ ని యాక్సెస్ చేసుకునేందుకు సౌలభ్యం కల్పిస్తుంది.
Advertisement
వాట్సాప్ యూజర్లు చాలా మందికి రెండు ఫోన్లు ఉండవచ్చు. కానీ రెండింటిలో వేర్వేరు నెంబర్లతో వాట్సాప్ ని యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకే నెంబర్ తో వాట్సాప్ ని రెండు ఫోన్లలో ఉపయోగించే ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. దీంతో చాట్ సింక్ సమస్యలు లేకుండా రెండు ఫోన్ల ద్వారా వాట్సాప్ ని వాడవచ్చు. ఇందు కోసం ఫాలో అవ్వాల్సిన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Also Read : వాట్సాప్ యూజర్ల కోసం మరో ఫీచర్.. ఇక నుంచి గూగుల్ డ్రైవ్ అవసరం లేదు..!
ఫస్ట్ మీరు వాడాలనుకుంటున్నటువంటి రెండో ఫోన్ లో వాట్సాప్ ఇన్ స్టాల్ చేయండి. ఇప్పుడు యాప్ ఓపెన్ చేసి ఇప్పటికే ఉన్నటువంటి వాట్సాప్ ఫోన్ నెంబర్ ని ఎంటర్ చేయండి. ఆ తరువాత మెనులోకి వెళ్లడానికి కుడివైపు పై భాగంలో కార్నర్ లో ఉన్నటువంటి త్రీ డాట్స్ బటన్ పై క్లిక్ చేయండి. అక్కడ డిస్ ప్లే అయ్యే ఆప్షన్ నుంచి లింక్ డివైజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీ మొదటి పోన్ లో వాట్సాప్ ఓపెన్ చేసి త్రి డాట్స్ మెను క్లిక్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఈ లిస్ట్ లో డిస్ ప్లే అయ్యే ఆప్షన్ నుంచి లింక్ డ్ డివైజెస్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తరువాత లింక్ ఏ డివైజ్ పై ట్యాప్ చేయండి. రెండో ఫోన్ లో చూపిస్తున్న QR కోడ్ ని మొదటి ఫోన్ ద్వారా స్కార్ చేయండి. చాట్ సింక్ అయ్యేంత వరకు వేచి ఉండాలి. అది పూర్తయిన తరువాత ఇక రెండు డివైజ్ లలో ఒకే వాట్సాప్ ఒకే సమయంలో ఉపయోగించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రయత్నించండి.
Also Read : పరగడుపున తేనెలో నానబెట్టిన ఉసిరి కాయ తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!