ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోడీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనా తో పాటు నిమోనియా బారిన పడిన లలిత్ మోడీ.. ప్రస్తుతం ఆక్సిజన్ సహాయంతో లండన్ లో చికిత్స పొందుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఫోటో పోస్ట్ చేసి ఆ విషయాన్ని వెల్లడించారు. రెండు వారాలలో కరోనా సోకడం ఇది రెండో సారి అని చెప్పారు. తొలిసారి కరోనా సోకిన సమయంలో మెక్సికో లో ఉన్న లలిత్ దాదాపు 3 వారాల పాటు హోం క్వారెంటైన్ లోనే ఉన్నారు.
Advertisement
దురదృష్టవశాత్తు ఇప్పటికీ కూడా 24/7 బయటి ఆక్సిజన్ తోనే ఉండాల్సి వచ్చింది. అందరికీ ధన్యవాదాలు అని తన ఇన్ స్టాగ్రామ్ పోస్టులో లలిత్ మోడీ పేర్కొన్నారు. ఆసుపత్రి బెడ్ పై తాను ఉన్న ఫోటోలను షేర్ చేశారు. అదేవిధంగా కరోనా పాజిటివ్ రిజల్ట్స్, 87 mm hg రీడింగ్ తో కూడిన పల్స్ ఆక్సి మీటర్, చాతి ఎక్సరేలను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గెట్ వెల్ సూన్ అంటూ పోస్ట్ చేస్తున్నారు అందరూ. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, సోదరుడు రాజీవ్ సేన్ మోడీ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు.
Advertisement
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీకి క్రీడా ప్రపంచంతో సుదీర్ఘ అనుబంధమే ఉంది. మరోవైపు ఐపీఎల్ ని కూడా ప్రారంభించింది లలిత్ మోడీ నే కావడం విశేషం. కొంత కాలం పాటు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. ఈ సమయంలోనే 2010లో లలిత్ మోడీపై మనీలాండరింగ్, బిడ్ సహా కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీంతో దేశం విడిచి వెళ్ళిపోయారు. ఇటీవల బాలీవుడ్ నటి సుస్మితాసేన్ తో కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. సుస్మితాసేన్ మాత్రం ఈ వార్తలను ఖండించింది. ఒకానొక సందర్భంలో లలిత్ మోడీ – సుష్మితాసేన్ మధ్య ఉన్న బ్రేకప్ అయినట్టు కూడా వార్తలు వినిపించాయి.
Also Read : ఈ స్టార్ విలన్ ఎలా చనిపోయారో తెలిస్తే..కన్నీళ్లు అస్సలు ఆగవు.!