ఏపీలోని నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్బీకేల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏపీలో నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇప్పటికే పలు శాఖలలో ఖాళీలను భర్తీ చేస్తున్న జగన్ సర్కారు తాజాగా మరోసారి ఉత్తర్వులు విడుదల చేసింది.
Advertisement
Advertisement
రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 4,765 పశుసంవర్ధక సహాయక పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి అధికారిక ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది.కాగా ఆర్బికేల్లో 1,644 ఉద్యాన, 467 వ్యవసాయ, 63 మత్స్య మరియు 22 పట్టు సహాయక పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. సంబంధిత శాఖల నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
అటు విత్తు నుంచి విక్రయం వరకు అన్నదాతలకు విశేష సేవలు అందించేలా రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వ అభివృద్ధి చేస్తోంది. అందుకే ఆర్బికేలో ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
READ ALSO : ఓ కుక్కను రూ.20 కోట్లు పెట్టి కొన్న హైదరాబాద్ నివాసి.. దాని ప్రత్యేకతలు ఇవే