ఒకప్పుడు టిడిపి పార్టీని తెలుగు రాష్ట్రాల్లో ఒక ఊపు ఊపిన జూనియర్ ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత టిడిపి పార్టీకి బాసుగా చంద్రబాబు నాయుడు వచ్చారు. ఆయన కూడా కొన్ని పర్యాయాలు టిడిపి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రస్తుతం టిడిపి ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతోంది. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టిడిపి అధికారంలోకి తేవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతూనే ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ టిడిపి బలపడుతుందని అంటున్నారు.
Advertisement
also read;వాట్సాప్ యూజర్ల కోసం మరో ఫీచర్.. ఇక నుంచి గూగుల్ డ్రైవ్ అవసరం లేదు..!
Advertisement
అయితే తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు తెలుగుదేశం అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి షాకింగ్ విషయాలు బయట పెట్టారు. ఆదివారం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేష్ కు టిడిపి పార్టీనీ అప్పగించేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా లేరని లక్ష్మీపార్వతి అన్నారు.. ఎన్టీఆర్ కు ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తే తప్పకుండా టిడిపిలోకి వస్తారని తెలియజేశారు.. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందని తెలియజేశారు..
జగన్ పాలనలో తిరుమల తిరుపతి మరింత అభివృద్ధి చేయడం ముందుకు పోతోందని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎదిరించలేరని తేల్చి చెప్పేశారు. ఎన్టీఆర్ ప్రస్తుతం సినీ కెరియర్ పై మాత్రమే దృష్టి పెట్టారని, గతంలో కూడా పలు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడానికి చాలా టైం పడుతుందని చెప్పడం మనం విన్నాం. మరి చూడాలి లక్ష్మీపార్వతి చేసిన కామెంట్స్ పై ఎలాంటి సమాధానం వస్తుందో..
also read;అత్తారింటికి వెళ్లే ముందు కూతురుకు తల్లి చెప్పిన విషయాలు..ఆ ఒక్కటి చాలా ఇంపార్టెంట్..!!