Home » అత్తారింటికి వెళ్లే ముందు కూతురుకు తల్లి చెప్పిన విషయాలు..ఆ ఒక్కటి చాలా ఇంపార్టెంట్..!!

అత్తారింటికి వెళ్లే ముందు కూతురుకు తల్లి చెప్పిన విషయాలు..ఆ ఒక్కటి చాలా ఇంపార్టెంట్..!!

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

25 ఏళ్లు ఓకే ఊరిలో, ఒకే వీధిలో, ఒకే ఇంట్లో ఉంటూ తల్లిదండ్రుల ప్రేమతో గారాబంగా పెరిగిన ఒక అమ్మాయి పెళ్లి సమయం దగ్గరికి వచ్చాక, తన 25 సంవత్సరాల ప్రపంచాన్ని అంతా విడిచి మరో కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తన మనసులో ఉన్న బాధను తల్లిదండ్రులతో చెప్పుకునే సందర్భం మనం ఇప్పుడు చూసేద్దాం..

Advertisement

 

చుట్టూ చీకటి కమ్మింది. తెల్లారితే వివాహం. రేపు ఈ టైం కల్లా నేను మరో ఇంటి పిల్లని. నేను పుట్టి పెరిగిన ఇల్లే నాకు పరాయి అవుతుంది.. మదిలో ఏవో ఆలోచనలు.. పడుకుంటే నిద్ర పట్టట్లే.. వీటన్నిటికీ సమాధానం చెప్పే ఒకే ఒక వ్యక్తి అమ్మ. టైం రాత్రి 12 అవుతోంది.. ఏమీ ఆలోచించకుండా బెడ్ రూమ్ కి వెళ్లి అమ్మను నిద్ర లేపా.. కానీ అమ్మ కూడా ఏదో ఆలోచనలో ఉన్నట్టుంది. నిద్రపోలేదు, నేను వెళ్ళిన వెంటనే లేచి కూర్చుంది.. ఇక ఆ రాత్రి తల్లి కూతుర్ల మధ్య చర్చ మొదలుకానుంది. కూతురు తల్లి ఓల్లో పడుకొని నిశ్శబ్దంగా తననే చూస్తోంది.. దీంతో అమ్మ ఏమైంది చిట్టితల్లి ఎందుకు అలా డల్ గా ఉన్నావని అడిగింది కళ్ళల్లోకి చూస్తూ.. వెంటనే నేను అడిగిన ప్రశ్న..?

also read:మాట్లాడినా ఏడ్చినా అది త‌ప్ప‌దు…వైర‌ల్ అవుతున్న స‌మంత పోస్ట్..!

అమ్మ రేపు నేను అత్తారింటికి వెళ్లాక వాళ్లు కూడా నీలాగా నా కళ్ళను బట్టి నన్ను అర్థం చేసుకుంటారా.. ఎందుకు చేసుకోరు. వారికి నువ్వు అవకాశం ఇవ్వాలి. వారితో ప్రేమగా ఉండాలి. నువ్వు వాళ్ల అమ్మాయివి అనిపించుకోవాలి. నువ్వు అత్తవారి ఇంటి సమస్యలు అర్దం చేసుకో గలిగితే వాళ్లు కూడా నిన్ను దగ్గర చేసుకుని నీ మనసు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు.

ఒకవేళ నా లైఫ్ స్టైల్ నచ్చలేదని తిడితే. దీనికోసం పెద్దగా ఆలోచించ వలసిన పనిలేదురా, ప్రతి ఒక్కరికి వారి లైఫ్ స్టైల్ అనేది ఉంటుందని వాళ్లని కన్వీన్స్ చేయడానికే ప్రయత్నించు. ఏదైనా నవ్వుతూ చేయాలని నా తల నిమురుతూ అమ్మ చెబుతోంది..

Advertisement

వాళ్లు నన్ను వంట చేయమనీ అడిగితే ఏం చేయాలి..?నేనిక్కడ ఎప్పుడూ వంట చేయలేదే… దానికి బాధెందుకు ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు ఉత్సాహంగా ఉండాలి. ఒకటి గుర్తు పెట్టుకో బిడ్డ మనం నేర్చుకునేది ఏధైనా మనకు ఉపయోగపడుతుంది.

పెళ్లి తర్వాత జాబ్ మానేయమని అత్త మామ అంటే..ముందు నీ భర్తను అడుగు, అతను కూడా ఉద్యోగం మానేయమని అంటే దానికి రీజన్ ఏంటో అడిగి తెలుసుకో.. వారు చెప్పింది కరెక్టు అని నీకు అనిపిస్తే అలాగే చెయ్, ఒకవేళ వాళ్ళు చెప్పింది రాంగ్ అనిపిస్తే వాళ్లను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించు తల్లి అంటూ అమ్మ చెప్పింది.

మరో ప్రశ్న పెళ్లి తర్వాత నా భర్తలో మార్పు వస్తే.. చూడమ్మా బుజ్జి కన్నా భార్యాభర్తలు అన్నాక చిన్నచిన్న గొడవలు సహజమే, నేను, మీ నాన్న ఎప్పుడూ గొడవపడలేదా, మీ అన్న వదినలు ఎప్పుడూ తిట్టుకోలేదా ..అంతెందుకమ్మ నీ బెస్ట్ ఫ్రెండ్ కూడా తన భర్తతో గొడవపడితే వారిద్దరూ నీ దగ్గరకొచ్చే రాజీపడతారు కదా. కాబట్టి గొడవలు సహజమే, మళ్లీ కలిసిపోవడం సహజమే అన్నది తల్లి.

ఒకటి గుర్తు పెట్టుకో తల్లి, నువ్వు అత్తవారింటిని నీ ఇల్లుగా, వాళ్లని నీ వాళ్లు అనుకుంటే ఏ సమస్యరాదు. ఇక చివరగా మీరు నన్ను మిస్ అవుతారా అమ్మ కన్నీరు కార్చుకుంటూ అడిగింది బిడ్డ.. తల్లి ఆ కన్నీళ్లను తుడుస్తూ ఎందుకు మిస్ అవుతామమ్మ రేపటి నుంచి నీకు ఇద్దరు అమ్మలు,ఇద్దరు నాన్నలు, నిన్ను కంటికి రెప్పలా చూసుకునే నీ భర్త..సో మేము నిన్నెక్కడ మిస్ అవుతామంటూ ఏడుస్తూ సమాధానమిచ్చింది తల్లి.

ఇంతలో డోర్ సౌండ్.. నీకు ఏ సమస్య వచ్చినా అక్కడ మేము వాలిపోతామమ్మ అంటూ డోర్ దగ్గర నిలబడ్డ మా నాన్న, కళ్ళు తుడుచుకుంటూ నా దగ్గరకు వచ్చి నుదుటిపై ముద్దు పెట్టాడు.

అలా ఆ రాత్రి అమ్మతో మాట్లాడక అమ్మ చెప్పిన మాటలు నాన్న ఇచ్చిన భరోసా నా మనసును కాస్త కుదుటపడేసాయి. తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారమే నేను అత్తారింట్లో నడుచుకోవాలని అనుకుంటున్నా.. నాకు అంతా మంచే జరుగుతుందని మనసులో అనుకుంటూ అలాగే అమ్మ ఒల్లో నిద్రపోయా..!

also read:

Visitors Are Also Reading