సినీ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది అతిలోక సుందరి శ్రీదేవి. అప్పట్లో శ్రీదేవి అందం చూడడానికి చాలా మంది థియేటర్లకు వెళ్లేవారు. తన అంద చందాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఆమె నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ అనిపించదు. ఇక ఆ సినిమాలో శ్రీదేవి ఎంత అందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. శ్రీ దేవి బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Advertisement
ఆ తరువాత బోనీకపూర్ ని వివాహం చేసుకుంది. ఆ దంపతులకు ఇద్దరూ కూతుర్లు. ప్రస్తుతం వారు కూడా హీరోయిన్స్ మారారు. 55 ఏళ్ల వయస్సులో దుబాయ్ లో అనుమానస్పద స్థితిలో తిరిగిరాని లోకాలకు వెళ్లింది. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రంలో శివగామి దేవి పాత్రకు ముందుగా శ్రీదేవిని తీసుకున్నారు. ఆమెకు కథ చెప్పి శ్రీదేవిని ఒప్పించాడట రాజమౌళి. కానీ అనుకోకుండా ఆమె స్థానంలో రమ్యకృష్ణ వచ్చారు. ఇక ఈ సినిమా విడుదలైన తరువాత రమ్యకృష్ణ పాత్రకు మంచి పేరు వచ్చిన తరువాత అసలు విషయాన్ని బయటపెట్టాడు రాజమౌళి.
Advertisement
Also Read : సుమ షోలో చిరంజీవి… మెగాస్టార్ ఎంట్రీకి అదే కారణమా…!
ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. “ నా అ ష్టం కొద్ది శివగామి పాత్రకు శ్రీదేవి గారు ఒప్పుకోలేదు” అని నవ్వూతూ మాట్లాడారు. శ్రీదేవి సినిమాలో నటించేందుకు రూ.7కోట్లు రెమ్యునరేషన్ అడిగిందట. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా చార్డ్జ్ ఫ్లైట్ టికెట్ తనతో పాటు తన అసిస్టెంట్లకు 5 స్టార్ హోటల్ బుక్ చేయాలని రకరకాల కండిషన్లు పెట్టారని.. తమకు బడ్జెట్ పరంగా వర్కౌట్ కాదని.. ఆమె ప్లేస్ లో రమ్య కృష్ణ తీసుకున్నారని చెప్పారు. రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన శ్రీదేవి రాజమౌళి బాహుబలి చిత్రాన్ని బాగా చేశారని.. ఆయన దర్శకత్వం చేసిన ఈగ సినిమా చాలా బాగా నచ్చిందని తెలిపారు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన అతను నేను అన్న మాటలు అలా చెప్పడం బాధవేసిందని చెప్పింది శ్రీదేవి.
Also Read : వీర సింహారెడ్డి లో ఈ డైలాగ్ గమనించారా? మీకు ఇదే డౌట్ వచ్చిందా ?