నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా శృతిహాసన్ బాలయ్యకు జోడీగా నటించింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ ను జనవరి 6వ తేదీన విడుదల చేశారు. కాగా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
Also Read: వీర సింహ రెడ్డి ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న మిమ్స్
Advertisement
ట్రైలర్ లో బాలయ్య యాక్షన్ సీన్ లు చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.ఇక బాలయ్య సినిమా అంటే డైలాగులు కూడా మినిమమ్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి సినిమాలోనూ బాలయ్య భారీ డైలాగులు కొట్టారు.అయితే ఓ డైలాగులో బాలయ్య ఏపీ సర్కార్ ను ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. బాలయ్య గత సినిమాలో కూడా వైసీపీ సర్కార్ పై పంచ్ లు విసిరారు. ఇక వీరసింహారెడ్డి సినిమాలోనూ పంచ్ లు విసిరారు.
Advertisement
Also Read: Powerful Veerasimha Reddy Dialogues
ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. కాగా దాన్ని జూనియర్ ఎన్టీఆర్ సహా నందమూరి ఫ్యామిలీ మొత్తం వ్యతిరేకించింది. ఇక వీరసింహారెడ్డి సినిమాలోనూ పేర్లు మార్చడం పై ఓ డైలాగ్ ఉంది.
సంతకాలు పెడితే బోర్డుమీద పేరు మారుతుందేమో…కానీ ఆ చరిత్ర సృష్టించినవాడి పేరు మారదు, మార్చలేరు… అంటూ బాలయ్య కోపంతో ఊగిపోయారు. ఇక ప్రస్తుతం వీరసింహారెడ్డి ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మరి భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలకు సిద్దం అవుతున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.
ALSO READ :యాంకర్ శ్రీ ముఖి పెళ్లి ఫిక్స్..ప్రముఖ వ్యాపారవేత్తతో వివాహం ?