Home » సుకుమార్ సినిమాల్లో ఈ కామన్ పాయింట్ ను గమనించారా….?

సుకుమార్ సినిమాల్లో ఈ కామన్ పాయింట్ ను గమనించారా….?

by AJAY
Ad

టాలీవుడ్ దర్శకులలో ఒక్కొక్కరి సినిమా లో కొన్ని పాయింట్లు కామన్ గా కనిపిస్తుంటాయి. అలా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన హీరోలు అంతా భుజానికి బ్యాగులు వేసుకుని కనిపిస్తూ ఉంటారు. రాజమౌళి సినిమాల్లో లాకెట్ సీన్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. యమదొంగలో చిన్న వయసులో హీరోయిన్ హీరో కు లాక్ ఇవ్వడం ఆ తర్వాత మళ్ళీ లాకెట్ ద్వారానే హీరోను గుర్తించడం కనిపిస్తుంది. అదే విధంగా ఈగ సినిమాలో నాని సమంతకు లాకెట్ చేసి ఇస్తాడు. ఇక ఆర్ ఆర్ సినిమాలోనూ లాకెట్ సీన్ ఉన్నట్టు కనిపిస్తోంది.

Advertisement

Comon point in sukumar movies

Comon point in sukumar movies

మరోవైపు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినిమాల్లో హీరోయిన్ ను బొడ్డు పై పూలు పండ్లతో కొట్టడం కామన్ గా కనిపిస్తుంది. అదేవిధంగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలోనూ ఓ కామన్ పాయింట్ కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే సుకుమార్ సినిమాలో హీరోయిన్లకు రైక పై పైట లేకుండా సీన్లు ఉంటాయి. రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో అనసూయ తో పాటు సమంత కు కూడా పైట లేకుండా ఉండే సీన్లు కనిపిస్తూ ఉంటాయి.

Advertisement

 

అదే విధంగా రీసెంట్ గా వచ్చిన పుష్ప లో కూడా అలాంటి సీన్లు కనిపిస్తున్నాయి. ఐటమ్ సాంగ్ లో సమంత పైట లేకుండా స్టెప్పులు వేస్తుంది. అదే విధంగా రాష్మిక మందన కూడా కొన్ని సీన్లలో పైట లేకుండానే కనిపిస్తుంది. ఇక సుకుమార్ తీసే సినిమాను బట్టి తన స్టైల్ ను మారుస్తుంటారు. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించే సినిమాల్లోనే ఈ క్రేజీ దర్శకుడు పైట లేకుండా ఉండే సీన్లను చిత్రీకరిస్తాడు. కానీ మిగతా సినిమాల్లో అలాంటి సీన్లు మాత్రం కనిపించవు.

Visitors Are Also Reading