తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఎన్నో ఆపసోపాలు పడ్డారు. కానీ ఆయనకు అనుకున్న స్టార్డం రావడానికి చాలా శ్రమించి చివరికి మెగాస్టార్ గా మారారు. ప్రస్తుతం ఆయన కు తెలుగు ఇండస్ట్రీ లో ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించారు. బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఇంతటి గుర్తింపు సాధించిన హీరోలలో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 50 కోట్ల వరకు పారితోషికం తీసుకునే స్థాయిలో ఉన్నాడు.
Advertisement
Also read:అందువల్లే సినిమాలు మానేశా.. సితారను అస్సలు కనాలని అనుకోలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసినా నమ్రత..!!
Advertisement
ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతకాలంలోనే కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకొని రికార్డు క్రియేట్ చేశాడు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి తన మొదటి పారితోషికం ఎంత తీసుకున్నాడో చాలామందికి తెలియదు. మరి ఆ విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అప్పట్లో చాలామంది నటీనటుల పారితోషికం కంటే సినిమా ఆఫర్ల కోసమే ఎక్కువగా ఎదురుచూసేవారు. సినిమా ఆఫర్లు వస్తే చాలు అని భావించేవారు. అలాంటి వారిలో చిరంజీవి కూడా ఒకరు. ఆ విధంగా చిరంజీవి తొలిసారి కెమెరా ముందు నటించిన సినిమా పునాదిరాళ్లు.
ఆ తర్వాత ప్రాణం ఖరీదు సినిమా. ఈ రెండు సినిమాలకు చిరంజీవి ఎలాంటి పారితోషికం తీసుకోలేదట. కానీ చిరు నటించిన మూడో చిత్రం మన ఊరి పాండవులు సినిమాకు అప్పట్లో వెయ్యినూటపదహార్లు పారితోషికం మొదటిసారి తీసుకున్నారట చిరంజీవి. కృష్ణంరాజు తోపాటు ఈ సినిమాలో ఐదుగురు హీరోలు. ఇందులో చిరంజీవి కూడా ఒకరు. ఈ పారితోషకం అందుకున్న చిరంజీవి చాలా సంతోషపడ్డారట. ఆ పాత రోజులు మర్చిపోకుండా చిరంజీవి తన లైఫ్ సింపుల్ గా సాగిస్తున్నాడు.
Also read;టాలీవుడ్ లో కోట్ల రూపాయల కట్నకానుకలు తీసుకున్న స్టార్ హీరోలు ఇంతమంది ఉన్నారా..?